PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/soniya635f7718-6cc6-4cad-9dd1-bae8b6b2ba84-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/soniya635f7718-6cc6-4cad-9dd1-bae8b6b2ba84-415x250-IndiaHerald.jpgదేశంలో రాజకీయం మారుతోంది. అయిదు రాష్ట్రాల ఫలితాలు అదే నిజమని చెబుతున్నాయి. మోడీ మీద మోజు తగ్గుతోంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి దేశంలో జాతీయ పార్టీలో పెద్దదైన కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఎంతవరకూ అంది పుచ్చుకుంది అనదే ఒక చర్చగా ఉంది. congress;modi;tiru;bharatiya janata party;west bengal - kolkata;congress;tamilnadu;partyకాంగ్రెస్.... ఉత్త చేతులేనా.... ?కాంగ్రెస్.... ఉత్త చేతులేనా.... ?congress;modi;tiru;bharatiya janata party;west bengal - kolkata;congress;tamilnadu;partySun, 02 May 2021 16:00:13 GMTదేశంలో రాజకీయం మారుతోంది. అయిదు రాష్ట్రాల ఫలితాలు అదే నిజమని చెబుతున్నాయి. మోడీ మీద మోజు తగ్గుతోంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి దేశంలో జాతీయ పార్టీలో పెద్దదైన కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఎంతవరకూ అంది పుచ్చుకుంది అనదే ఒక చర్చగా ఉంది.

కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయే కూటమి పాలన రెండు సార్లు దేశంలో సాగింది. ఆ కూటమిని  కూలదోసి బీజేపీ వచ్చింది. ఇపుడు బీజేపీ తగ్గితే మళ్లీ కాంగ్రెస్ ఆ స్థానంలోకి రావాలి. కానీ అయిదు రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ హవా పెద్దగా కనిపించలేదు. అసోం లో కొన్ని పార్టీలతో కలసి కూటమి కట్టిన కాంగ్రె గతం కంటే ఎక్కువ సీట్లు సాధించేలా ఉంది కానీ అధికారానికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ వరసబెట్టి బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ కి ఝలక్ తగిలింది.

ఇక కేరళలో ఒకసారి లెఫ్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే మరోసారి కాంగ్రెస్ కూటమి అధికారం చేపడుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ ఈసారి అక్కడ పక్కాగా  అధికారంలోకి రావాలి.  కానీ కాంగ్రెస్ గెలవలేకపోయింది. పైగా గతం కంటే తక్కువ సీట్లు కూడా వస్తున్నాయి. దీంతో కేరళలో అధికారం దక్కని కాంగ్రెస్ తన గ్రాఫ్ తగ్గించుకున్నట్లు అయింది.

ఇక తమిళనాడులో చూసుకుంటే డీఎంకే కూటమి గెలిచింది. కానీ ఆ కూటమిలో కాంగ్రెస్ కి ఇచ్చిన సీట్లు కేవలం ఇరవై మాత్రమే. ఇందులో ఎన్ని గెలిచినా కూడా పెద్దగా సుఖం లేదు అనే చెప్పాలి. ఇక పాండిచ్చేరిలో కూడా కూటమి అధికారం పోతోంది. పశ్చిన బెంగాల్ లో గత సారి పెర్ఫార్మెన్స్ ని కూడా ఈసారి చూపించలేకపోతోంది. మరో వైపు తెలంగాణాలో కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. తిరుపతిలో ఆ పార్టీ అయిపూ అజా లేదు. మొత్తానికి చూసుకుంటే బీజేపీ తగ్గినా ప్రాంతీయ పార్టీలే పుంజుకుంటున్నాయి తప్ప కాంగ్రెస్ కి పొలిటికల్ గా లాభమేదీ లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేరళలో సరికొత్త చరిత్ర..!!

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>