MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjive-movie-song-movie75e62d0c-513a-4b46-a48d-b610dfc64570-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjive-movie-song-movie75e62d0c-513a-4b46-a48d-b610dfc64570-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాదు.. ఈయన సినిమాలలో వచ్చే పాటలు కూడా అంతే స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదిస్తాయి. ఈయన తీసే సినిమాలో కథలతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మైమరపిస్తాయి. ఇక అలాంటి సూపర్ హిట్ సినిమాలలో మనం చెప్పుకోదగ్గ చిత్రం ఛాలెంజ్.. ఈచిత్రం 1984 లో వచ్చిన ఈ సినిమాకు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా , కె.ఎస్.రామారావు నిర్మించాడు. ఇక ఈ చిత్రం లో హీరో గా మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ గా విజయశాంతి కలిసి నటించి ప్రేక్షకులను మCHIRANJIVE MOVIE SONG MOVIE;chiranjeevi;ilayaraja;vijayashanti;varun;varun sandesh;varun tej;tollywood;cinema;bigboss;blockbuster hit;hero;heroine;research and analysis wing;happy days;dilచిరంజీవి హిట్ సాంగ్ టైటిల్ తో మరో మూవీ ?చిరంజీవి హిట్ సాంగ్ టైటిల్ తో మరో మూవీ ?CHIRANJIVE MOVIE SONG MOVIE;chiranjeevi;ilayaraja;vijayashanti;varun;varun sandesh;varun tej;tollywood;cinema;bigboss;blockbuster hit;hero;heroine;research and analysis wing;happy days;dilSun, 02 May 2021 17:00:00 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు   బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాదు.. ఈయన సినిమాలలో వచ్చే పాటలు కూడా అంతే స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదిస్తాయి. ఈయన తీసే సినిమాలో కథలతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మైమరపిస్తాయి. ఇక అలాంటి సూపర్ హిట్ సినిమాలలో మనం చెప్పుకోదగ్గ చిత్రం ఛాలెంజ్.. ఈచిత్రం 1984 లో వచ్చిన ఈ సినిమాకు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా , కె.ఎస్.రామారావు నిర్మించాడు. ఇక ఈ చిత్రం లో  హీరో గా  మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ గా విజయశాంతి కలిసి నటించి ప్రేక్షకులను మైమరిపించారు..


ఇక ఈ చిత్రానికి కి వేటూరి సుందర మూర్తి గారు పాటలనందించగా, ఆ పాటలకు చక్కని సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇక ఇందులో ముఖ్యంగా "ఇందువదన కుందనదన మందగమన మధురవచన " అనే ఈ పాట ఎంత పాపులర్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ పాటను స్వయంగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.జానకి గారు పాడి, బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించి పెట్టారు.

ఇక ఈ పాటలో మొదటిగా వచ్చిన " ఇందువదన" అనే సినిమా టైటిల్ తో మరొక యంగ్ హీరో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనెవరో కాదు ..హ్యాపీ డేస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో లో తెరకెక్కిన చిత్రం కొత్త బంగారు లోకం .ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో వరుణ్ సందేశ్ ,టాలీవుడ్ లో  మరో యంగ్ హీరో గా  ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఎంచుకున్న సినిమాలు, అతనికి పరాజయాన్ని తెచ్చిపెట్టాయి. తద్వారా తన పూర్తి ఇమేజ్ ను పోగొట్టుకున్నాడు. ఇక వరుణ్ సందేశ్ చివరిగా నువ్వు తోపురా అనే సినిమాలో  నటించాడు.


అయితే బిగ్ బాస్ సీజన్ త్రీ లో భార్యతో కలిసి వరుణ్ సందేశ్ పాల్గొన్నాడు. ఇక ఈ షో ద్వారా మళ్ళీ లైన్లోకి వచ్చాడు వరుణ్ సందేశ్. ఈ నేపథ్యంలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదే "ఇందువదన " అనే  సినిమా ద్వారా ఎం ఎస్ ఆర్ అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.. ఇక ఈ సినిమా ద్వారా వరుణ్ సందేశ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారో లేదో వేచి చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేరళలో సరికొత్త చరిత్ర..!!

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>