PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha--didi-viral-newscfc1efec-f997-4e71-951b-c679c909d20d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha--didi-viral-newscfc1efec-f997-4e71-951b-c679c909d20d-415x250-IndiaHerald.jpgదేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గతంలో దేశంలో ఏ ఎన్నిక జరిగినా మోడీ మీదనే చర్చ ఉండేది. మోడీ ఫీవర్ ఎలా పనిచేస్తోంది. ఆయన ఇమేజ్ పనిచేసిందా లేదా అన్నదే ఆ చర్చ. కానీ ఇపుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో అందరి చూపు మరో నేత మీద ఉంది. ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. mamata;modi;mamata benerjee;benarjee;tara;bharatiya janata party;west bengal - kolkata;central government;mamta mohandas;dookuduవిపక్షాలకు మమత ఫీవర్ ?విపక్షాలకు మమత ఫీవర్ ?mamata;modi;mamata benerjee;benarjee;tara;bharatiya janata party;west bengal - kolkata;central government;mamta mohandas;dookuduSun, 02 May 2021 10:19:00 GMTదేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గతంలో దేశంలో ఏ ఎన్నిక జరిగినా మోడీ మీదనే చర్చ ఉండేది. మోడీ ఫీవర్ ఎలా పనిచేస్తోంది. ఆయన ఇమేజ్ పనిచేసిందా లేదా అన్నదే ఆ చర్చ. కానీ ఇపుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో అందరి చూపు మరో నేత మీద ఉంది. ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

ఆమె బెంగాల్ లో ముచ్చటగా మూడవ సారి గెలవాలని చూస్తున్నారు. ఆమె రెండు సార్లు లెఫ్ట్ పార్టీల మీద గెలిస్తే ఈసారి కాషాయం పార్టీతో తలపడుతున్నారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో గెలవడం ద్వారా దేశంలో మోడీ ఇమేజ్ మరింత బలంగా ఉందని చాటి చెప్పాలని బీజేపీ ఆరాటం అయితే అక్కడ మమతకు దక్కే హ్యాట్రిక్ విజయం తో విపక్షాలకు పెద్ద ఊపు వస్తుంది అన్నది మరో వాస్తవం. ఎందుకంటే దేశంలో ఏ విపక్ష నాయకుడూ కూడా మమత అంత దూకుడుగా కేంద్రంలోని బీజేపీని కాని మోడీని కానీ ఎదిరించడంలేదు.

పైగా మమత అక్కడ కనుక గెలిస్తే దేశంలో విపక్షాల మూడవ ఫ్రంట్ ఆశలకు ఊపిరి పోసినవారు అవుతారు. ఆమె ఇప్పటికే దేశంలోని విపక్ష నేతలకు లేఖలు రాసి మోడీ వ్యతిరేక పోరాటంలో మద్దతు ఇవ్వాలని గట్టిగా కోరారు. అటువంటిది ఆమె కనుక మూడవసారి బెంగాల్ సీఎం అయితే కచ్చితంగా మోడీ కి ఎదురు నిలిచే నేత అవుతారు. అంతే కాదు, దేశంలోనే ఆమె అత్యంత కీలకమైన నేతగా కూడా మారిపోతారు.

అందుకే అక్కడ మమత గెలవాలని మోడీ వ్యతిరేకులు బలంగా కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల నాయకులు, విపక్ష నేతలు కూడా మోడీని ఢీ కొట్టేందుకు మమత విజయం ఒక టానిక్ గా ఉపయోగపడుతుంది అని భావిస్తారు. ఇక అప్రతిహతంగా విజయాలను నమోదు చేసుకుంటున్న మోడీ కి బెంగాల్ కూడా దాసోహం అయితే ఇక దేశంలో విపక్షాలకు మంచి నీళ్ళు పుట్టవు అన్న భయం కూడా ఉంది. ఇవన్నీ కలసి ఈసారి ఫోకస్ పూర్తిగా మమత మీద ఉంది. ఆమె ఎంత దూకుడుగా అక్కడ జెండా పాతితే అంతగా దేశంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది అంటున్నారు. చూడాలి మరి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కరోనా టెర్రర్.. 80వేలు దాటిన యాక్టీవ్ కేసులు..!!

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>