MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpad656dfd8-f51f-4ad4-8a58-6d3ae37b703e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpad656dfd8-f51f-4ad4-8a58-6d3ae37b703e-415x250-IndiaHerald.jpgగతేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హారిక హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థలపై నిర్మితమైన ఈ సినిమాకి తమన్ అందించిన సాంగ్స్ నేషనల్ వైడ్ గా పాపులర్ అవడంతో పాటు యూట్యూబ్ లో వందలకొద్ది వ్యూస్ అందుకుని శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. pushpa teaser;view;kumaar;allu arjun;prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;youtube;you tube;blockbuster hit;vegetable market;heroine;mythri movie makers;arjun 1పుష్ప టీజర్ అల్ టైం సెన్సేషనల్ రికార్డు .....!!పుష్ప టీజర్ అల్ టైం సెన్సేషనల్ రికార్డు .....!!pushpa teaser;view;kumaar;allu arjun;prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;youtube;you tube;blockbuster hit;vegetable market;heroine;mythri movie makers;arjun 1Sun, 02 May 2021 21:00:06 GMTగతేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హారిక హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థలపై నిర్మితమైన ఈ సినిమాకి తమన్ అందించిన సాంగ్స్ నేషనల్ వైడ్ గా పాపులర్ అవడంతో పాటు యూట్యూబ్ లో వందలకొద్ది వ్యూస్ అందుకుని శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్, మార్కెట్ మరింతగా పెరిగాయి అని చెప్పక తప్పదు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఇటీవల అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ని యూట్యూబ్లో విడుదల చేశారు యూనిట్. అయితే మొదటి రోజు నుంచే వ్యూస్, లైక్స్ పరంగా దుమ్ము రేపుతున్న పుష్ప టీజర్ నేటితో టాలీవుడ్ లో ఒక ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

కొద్దిసేపటి క్రితం ఈ టీజర్ ఏకంగా 60 మిలియన్ల వ్యూస్ అందుకోవటం తో పాటు 1.3 మిలియన్ లకు పైగా లైక్స్ దక్కించుకుని టాలీవుడ్ మూవీ టీజర్స్ లో అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న టీజర్ గా రికార్డుకెక్కింది. నిజానికి ఈ టీజర్ రిలీజ్ తర్వాత పుష్ప పై అందరిలోనూ అంచనాలు విపరీతంగా పెరిగాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమాని యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. కాగా ఈ మూవీని ఈ యేడాది ఆగస్టు 13న విడుదల చేయనున్నారు......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>