MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఇటీవల కాలంలో మొన్నటివరకు పాన్ ఇండియా మూవీ లు హల్ చల్ చేయగా, ఆ తర్వాత మల్టీస్టారర్ మూవీ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఇప్పుడు రీమేక్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే గత దశాబ్దాల క్రితం తీసిన సినిమాలను కూడా ఈ మధ్య కాలంలో తిరిగి రీమేక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రీమేక్ చిత్రాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోలు ప్రవేశిస్తున్నారు .ఇక అదే బాట లోనే ఒక కొత్త హీరో ప్రవీణ్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్నాడు.. అయితే ఈ హీరో కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. KANNADA NEW HERO PRAVEEN ,SHASAANK, HERO YASH;nithin;sada;prasanth;prashanth neel;praveen;shashank;teja;yash;india;cinema;telugu;kannada;industry;remake;driver;hero;vegetable market;heroine;success;international;prasanth neel;nithin reddy;prashant kishorదాదాపు 20 ఏళ్ల తర్వాత జయం రీమేక్ !దాదాపు 20 ఏళ్ల తర్వాత జయం రీమేక్ !KANNADA NEW HERO PRAVEEN ,SHASAANK, HERO YASH;nithin;sada;prasanth;prashanth neel;praveen;shashank;teja;yash;india;cinema;telugu;kannada;industry;remake;driver;hero;vegetable market;heroine;success;international;prasanth neel;nithin reddy;prashant kishorSun, 02 May 2021 14:00:00 GMT

ఇటీవల కాలంలో మొన్నటివరకు పాన్ ఇండియా మూవీ లు హల్ చల్ చేయగా, ఆ తర్వాత మల్టీస్టారర్ మూవీ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఇప్పుడు రీమేక్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే గత దశాబ్దాల క్రితం తీసిన సినిమాలను కూడా ఈ మధ్య కాలంలో తిరిగి రీమేక్  చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రీమేక్ చిత్రాల ద్వారా  సినీ ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోలు ప్రవేశిస్తున్నారు .ఇక అదే బాట లోనే ఒక కొత్త హీరో ప్రవీణ్ కూడా  కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్నాడు.. అయితే ఈ హీరో కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రవీణ్ గురించి తెలుసుకోవడం కంటే ముందుగా మనం యస్ గురించి తెలుసుకోవాలి. కన్నడ సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కు  తీసుకెళ్లిన ఏకైక హీరో యష్. కే జి ఎఫ్ చాప్టర్ వన్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. అసలు ఆ సినిమా ఆ రేంజిలో ఉంటుందని  ఎవరూ కూడా ఊహించి ఉండరు.. ముఖ్యంగా ఈ సినిమా అంత రేంజ్లో హిట్ అవడానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్, ఒక హీరో ను  గొప్పగా  ప్రెజెంట్ చేయడం. ఇలా సరికొత్తగా  యస్ ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమా బాగా ప్లస్ అయ్యింది..

ఇక నిజానికి హీరో యస్ ఒక డ్రైవర్ కొడుకు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక అలాంటి ఒక వ్యక్తిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొదటి దర్శకుడు శశాంక్.  యస్ అవకాశాల కోసం ఎంతో కష్టపడుతున్న  సమయంలో యస్ యొక్క ఫిట్నెస్ అలాగే అతని ఇంట్రెస్ట్ ను చూసి ,ఒక సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ని మొత్తం ఆ కుర్రాడు ఏలుతున్న విషయం తెలిసిందే..ఇప్పుడు అదే తరహాలో శశాంక్ మరొక కుర్రాడిని సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. అతనే  ఈ హీరో ప్రవీణ్. ప్రవీణ్ అనే ఒక కొత్త కుర్రాడిని, ఒక సంవత్సరం పాటు బాగా సానబెట్టి ,ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ని సెట్ చేసుకున్నట్లు సమాచారం..

ప్రస్తుతం కన్నడ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తోంది.. ఇక శశాంత్ రాసి పెట్టుకున్న కథ లో హీరోగా ఈ ప్రవీణ్ నటించబోతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా తెలుగులో కూడా రానుందట. ఇక శశాంక్సినిమా అనంతరం ఆ కుర్రాడితో జయం రీమేక్ లో  కూడా నటించడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 2001 సంవత్సరంలో నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం జయం ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రవీణ్ అనే కొత్త హీరో తో దర్శకుడు శశాంక్ జయం సినిమాను  కన్నడలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. మరి ప్రవీణ్ అనే ఈ కొత్త హీరో కన్నడ ఇండస్ట్రీ లో ఎంతవరకు క్లిక్ అవుతాడో లేదో చూడాలి మరి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగ‌ర్ 20వ రౌండ్‌... టీఆర్ఎస్ మెజార్టీ ఇదే

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>