MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-vakilsab-2-movie-de161e7f-3fcf-42ef-b5e9-2967668c9680-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-vakilsab-2-movie-de161e7f-3fcf-42ef-b5e9-2967668c9680-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగి మూడు సంవత్సరాల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి, మొట్టమొదటిగా నటించిన చిత్రం వకీల్ సాబ్. అన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వహించాడు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలలో నటించి హిట్ అయిన చిత్రం పింక్. ఇక ఈ చిత్రం రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించినప్పటికి, పవన్ కళ్యాణ్ అభిమానులను అలాగే తెలుగు పPAWAN KALAYAN VAKILSAB 2 MOVIE;pawan;amitabh bachchan;dil raju;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;producer;king;remake;press;producer1;pink;kathanam;venu sreeram;dilఅక్కడ వకీల్ సాబ్ 2 కి రంగం సిద్ధం ?అక్కడ వకీల్ సాబ్ 2 కి రంగం సిద్ధం ?PAWAN KALAYAN VAKILSAB 2 MOVIE;pawan;amitabh bachchan;dil raju;kalyan;pawan kalyan;sriram;bollywood;cinema;producer;king;remake;press;producer1;pink;kathanam;venu sreeram;dilSun, 02 May 2021 15:00:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగి మూడు సంవత్సరాల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి, మొట్టమొదటిగా నటించిన చిత్రం వకీల్ సాబ్. అన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వహించాడు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలలో నటించి హిట్ అయిన చిత్రం పింక్. ఇక ఈ చిత్రం రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించినప్పటికి, పవన్ కళ్యాణ్ అభిమానులను అలాగే తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని  ఈ సినిమాని తీయగా ఈ చిత్రం మొదటి షో తోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.


ఇక ముఖ్యంగా  పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అందుకు ఉపయోగపడే కొన్ని డైలాగ్ లను కూడా ఇందులో పొందుపరచడం విశేషం. దాంతో పవన్ అభిమానులను బాగా అట్రాక్ట్ చేశాడు వేణు. అంతేకాదు ఇతని పని తనానికి పవన్ కూడా ఇంప్రెస్ అయిపోయి, మరో సినిమా చేయడానికి కూడా పవన్ రెడీ అయిపోయాడట. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం ఉన్న దిల్ రాజు, ఈ ప్రాజెక్టుని  కూడా నేనే నిర్మిస్తానని ముందుకు వచ్చాడట. అయితే వేణు తన సొంత కథతో.. వకీల్ సాబ్ సీక్వెల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఇందులో స్త్రీల గొప్పతనం గురించి చెప్పగా, సీక్వెల్ లో పూర్తిగా రైతుల సమస్యలు ,అలాగే గ్రామాల అభివృద్ధి కి ఎలా తోడ్పడాలి ?  అనే అంశంపై సరికొత్త కథనంతో , అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ,ఆయనకు అన్ని రకాలుగా ఉపయోగపడే ఒక సరికొత్త సీక్వెల్ ను, సిద్ధం చేయాలని అతడు డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇక ఇప్పటికే ఈ థీమ్ ను వేణు శ్రీరామ్ , నిర్మాత అయిన దిల్ రాజుకు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా వినిపించాడట. ఇక వీరికి ఇది బాగా నచ్చడంతో వారు కూడా ఓకే చెప్పేశారు.. అయితే చూడాలి మరి.. ఈ సీక్వెల్ లో పవన్ కళ్యాణ్ ను వేణు శ్రీరామ్ ఎలా చూపించబోతున్నాడు అని..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'KGF2' లో మరో స్పెషల్ సాంగ్.. యశ్ తో అదిరిపోయే స్టెప్పులేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు..!!

ఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>