MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cheating-on-the-name-os-saiodharam-tejf9d0ae75-4bc3-4655-9543-9a4dbba028a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cheating-on-the-name-os-saiodharam-tejf9d0ae75-4bc3-4655-9543-9a4dbba028a0-415x250-IndiaHerald.jpgఫేక్ ఎకౌంట్ లు ఫేక్ ఛాటింగ్ లు చేస్తూ ప్రజలను కోట్లాది రూపాయలలో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సెలెబ్రెటీల పేర్లతో ఫేక్ ఎకౌంట్స్ సృష్టించడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మోసాల నుండి తప్పించుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సైబర్ నేరగాళ్ళ తెలివిముందు ఆగలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పేరిట కొందరు సైబర్ నేరగాళ్ళు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. సాయి తేజ్ పేరుతో తనకు అర్జంట్ గా డబ్బులు కావాలి అంటూ ఫాల్స్ మెసేజsaidharamtej;;sai dharam tej;heroసాయి ధరమ్ తేజ్ పేరిట ఘరానా మోసం !సాయి ధరమ్ తేజ్ పేరిట ఘరానా మోసం !saidharamtej;;sai dharam tej;heroSun, 02 May 2021 10:00:00 GMTఫేక్ ఎకౌంట్ లు ఫేక్ ఛాటింగ్ లు చేస్తూ ప్రజలను కోట్లాది రూపాయలలో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సెలెబ్రెటీల పేర్లతో ఫేక్ ఎకౌంట్స్ సృష్టించడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మోసాల నుండి తప్పించుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సైబర్ నేరగాళ్ళ తెలివిముందు ఆగలేక పోతున్నారు.  


ఇలాంటి పరిస్థితులలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పేరిట కొందరు సైబర్ నేరగాళ్ళు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. సాయి తేజ్ పేరుతో తనకు అర్జంట్ గా డబ్బులు కావాలి అంటూ ఫాల్స్ మెసేజ్ లు కొందరు సెల్ ఫోన్స్ కు రావడంతో ఏకంగా తేజ్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.


"ఓ వ్యక్తి నాలా మారి, నాకు తెలిసిన కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నాడు. నాతో కలిసి నటించిన వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం అడుగుతున్నాడు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతున్నాను. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి." అంటూ అందరికీ జాగ్రత్తలు చెపుతున్నాడు. ఒకవైపు కరోనా కష్టాలు రోజురోజుకు పెరిగిపోతుంటే మరొకవైపు ఇదే కష్టకాలంలో ఘరానా మోసాలు కూడ ఎక్కువై పోతున్నాయి.


ఈమధ్య కాలంలో జడ్జేస్ పేరున కూడ ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ అవుతూ వారు అనని విషయాలు వారు అన్నట్లుగా వైరల్ అవుతున్న పరిస్థితులలో ఈ సైబర్ నేరగాళ్ళను అదేవిధంగా ఈ ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసేవారిని ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రభుత్వాలు కూడ తల పట్టుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మూలాలు కలిగిన ఈ సైబర్ నేర సంస్కృతిని కట్టడి చేయడం బాగా అభివృద్ధి చెందిన దేశాలకు కూడ పరిష్కారం లేని సమస్యగా మారింది. సెలెబ్రెటీలను రాజకీయవేత్తలను భయపెడుతున్న సైబర్ నేరగాళ్ళ టార్గెట్ లో ఇప్పుడు సాయి తేజ్ కూడ చేరిపోవడంతో ఈవిషయం షాకింగ్ న్యూస్ గా మారింది..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విపక్షాలకు మమత ఫీవర్ ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>