PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bf856e95-9067-4734-8dc1-6526832ede4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bf856e95-9067-4734-8dc1-6526832ede4f-415x250-IndiaHerald.jpg త‌న‌వ‌ద్దే ఈ శాఖ ఉంటే నిరంత‌రం స‌మీక్ష‌లు చేయ‌డం సాధ్యం కాద‌ని భావిస్తున్న కేసీఆర్‌.. మాజీ మంత్రి, ఎమ్మెల్యేకు వైద్య ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌రువాత తొలి క్యాబినెట్‌లో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా తాటికొండ రాజ‌య్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలోనే స్వైన్‌ప్లూ వ్యాధి విజృంభించింది. ఈ వ్యాధిని అరిక‌ట్ట‌డంలో, వైద్య ఆరోగ్య‌శాఖ శాఖ అధికారులు, సిబ్బందిని స‌మ‌న్వ‌యం చేసి ప‌నిచేయించ‌డంలో రాజ‌య్య విఫ‌ల‌మ‌య్యాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయిtelangana;kcr;telangana rashtra samithi trs;telangana;smart phone;mla;ministerమ‌రోసారి ఫోన్ వెళ్లింది ..? ఆయ‌న‌కే వైద్య ఆరోగ్య‌శాఖ!మ‌రోసారి ఫోన్ వెళ్లింది ..? ఆయ‌న‌కే వైద్య ఆరోగ్య‌శాఖ!telangana;kcr;telangana rashtra samithi trs;telangana;smart phone;mla;ministerSun, 02 May 2021 09:35:44 GMTతెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెరాస సీనియ‌ర్ నేత‌, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూక‌బ్జాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈట‌ల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో పాటు.. ఈట‌ల వ‌ద్ద ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకున్నారు కేసీఆర్‌. ప్ర‌స్తుతం సీఎం వ‌ద్ద‌నే వైద్య ఆరోగ్య‌శాఖ ఉంది. తాజాగా ఈ శాఖ‌ను ప్ర‌స్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రికి అప్ప‌గించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తుంది. తెలంగాణ‌లోనూ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉన్న ఈట‌ల.. స‌మ‌ర్థ‌వంతంగా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ఏరోజుకారోజు అధికారుల‌తో స‌మీక్షలు నిర్వ‌హిస్తూ క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేశారు. తాజా ప‌రిణామాల‌తో ఈట‌ల నుంచి వైద్య ఆరోగ్య‌శాఖ కేసీఆర్ చేతిలోకి వెళ్లింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ‌నే కీల‌కం. నిరంత‌రం అధికారుల‌తో స‌మీక్షలు చేస్తూ, వారిని అల‌ర్ట్ చేస్తూ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ క‌రోనా క‌ట్ట‌డికి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌న‌వ‌ద్దే ఈ శాఖ ఉంటే నిరంత‌రం స‌మీక్ష‌లు చేయ‌డం సాధ్యం కాద‌ని భావిస్తున్న కేసీఆర్‌.. మాజీ మంత్రి, ఎమ్మెల్యేకు వైద్య ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌రువాత తొలి క్యాబినెట్‌లో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా తాటికొండ రాజ‌య్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలోనే స్వైన్‌ప్లూ వ్యాధి విజృంభించింది. ఈ వ్యాధిని అరిక‌ట్ట‌డంలో, వైద్య ఆరోగ్య‌శాఖ శాఖ అధికారులు, సిబ్బందిని స‌మ‌న్వ‌యం చేసి ప‌నిచేయించ‌డంలో రాజ‌య్య విఫ‌ల‌మ‌య్యాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి ఆశాఖ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అప్ప‌టికే రాజ‌య్య‌పై గుర్రుగా ఉన్న కేసీఆర్‌.. రాజ‌య్య‌ను తొల‌గించి ఆ శాఖ‌ను జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి అప్ప‌గించారు. ల‌క్ష్మారెడ్డి రెండ‌వ ద‌ఫా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా కొన‌సాగారు.

2018 ఎన్నిక‌ల త‌రువాత క్యాబినెట్‌లో ల‌క్ష్మారెడ్డికి చోటు ద‌క్క‌లేదు. ఈట‌ల రాజేంద‌ర్‌కు వైద్య ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రోసారి జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డికి ఫోన్ వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. సీఎం కేసీఆర్ కార్యాల‌యం నుంచి వెంట‌నే రావాల‌ని ల‌క్ష్మారెడ్డికి ఫోన్ వెళ్ల‌డం.. ఆయ‌న సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడ‌టం జ‌రిగిపోయిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ క్ర‌మంలో వారం రోజుల్లో ల‌క్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని స‌మాచారం. అయితే కేవ‌లం ఒక్క వైద్య ఆరోగ్య‌శాఖ‌నే ల‌క్ష్మారెడ్డికి ఇస్తారా..?  లేక మంత్రి వ‌ర్గంలో ప‌లు శాఖ‌ల మార్పులు చేర్పులు ఉంటాయా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కరోనా టెర్రర్.. 80వేలు దాటిన యాక్టీవ్ కేసులు..!!

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>