PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyancbb21e07-1d29-4749-a13e-81df254f95a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyancbb21e07-1d29-4749-a13e-81df254f95a0-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు మళ్లీ పూనకం వచ్చేసింది.. అసలు ఏపీలో పాలన ఉందా లేదా అని ఆయన నిలదీస్తున్నారు. ఏపీలోని అనేక ఆసుపత్రుల్లో రోగులు చనిపోయిన ఘటనలపై ఆయన స్పందించారు. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రులలో సౌకర్యాల లేమి వల్లే ప్రజలు అనుమతి లేని ఆసుపత్రులకు వెళ్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. నిన్న కర్నూలులోని అనుమతి లేని ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ఆరుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారpawan-kalyan;pawan;pawan kalyan;tara;janasena;telugu;kurnool;government;tdp;oxygen;janasena partyపవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?పవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?pawan-kalyan;pawan;pawan kalyan;tara;janasena;telugu;kurnool;government;tdp;oxygen;janasena partySun, 02 May 2021 06:00:00 GMTజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు మళ్లీ పూనకం వచ్చేసింది.. అసలు ఏపీలో పాలన ఉందా లేదా అని ఆయన నిలదీస్తున్నారు. ఏపీలోని అనేక ఆసుపత్రుల్లో రోగులు చనిపోయిన ఘటనలపై ఆయన స్పందించారు. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రులలో సౌకర్యాల లేమి వల్లే ప్రజలు అనుమతి లేని ఆసుపత్రులకు వెళ్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  విమర్శించారు.

నిన్న కర్నూలులోని అనుమతి లేని ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ఆరుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ .. అసలు ఈ రాష్ట్రంలో పాలన ఉందా.. 104 పని చేయదు... అంబులెన్సులు రావు... నిర్ధారణ పరీక్షలు చేయరు... ఏంటిది.. రాష్ట్రంలో అసలు పాలన అనేది ఉందా ? అని ప్రశ్నించారు. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా ఇటీవల కరోనా బారిన పడి సంగతి తెలిసిందే.

హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. ఏపీలో కరోనా రోగుల దుస్థితిపై ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ మంచి జనాకర్షణ కలిగిన నాయకుడు.. అందులో అనుమానం లేదు.. కేవలం జనాకర్షణే కాదు.. సామాజిక బలం కూడా కలిగిన నాయకుడు. కానీ.. ఆయనతో వచ్చిన చిక్కేమిటంటే.. ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయరు.. పార్ట్‌ టైమ్ పాలిటిక్స్‌తోనే సరిపెడతారు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు కూడా చెబుతారు. రాజకీయాల్లో పార్టీని నడిపించాలంటే డబ్బు కావాలి కదా.. నాకు సినిమాలు మాత్రమే వచ్చు.. అందుకే సినిమాల్లో సంపాదిస్తా.. రాజకీయాల్లో ఖర్చు చేస్తా అంటారు.

అయితే ఏపీలో మారుతున్న పరిస్థితుల్లో పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ పనికిరావు. నిన్నటి వరకూ బలమైన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం రోజు రోజుకూ చతికిలపడుతోంది. ఈ సమయంలో బలమైన ప్రత్యర్థిగా ఖాళీగా ఉన్న స్థలాన్ని పవన్ కల్యాణ్‌ భర్తీ చేస్తే ఆయనకు మంచి రాజకీయ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం పాత్ర నుంచి టీడీపీ తప్పుకుంటుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తే పవన్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు స్టార్ హీరోలకు ఉన్న అలవాట్లు ఏంటో తెలుసా..!

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>