PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-banerjee7874cf26-fd97-49b5-8182-fad73aaa74f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-banerjee7874cf26-fd97-49b5-8182-fad73aaa74f1-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త బెన‌ర్జీ గెలుపున‌కు అనేక కార‌ణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె వ్యూహాల‌కు తోడు వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు తోడ‌వ్వ‌డంతో బ‌ల‌మైన బీజేపీని స‌మ‌ర్థ‌వంతంగా దీదీ ఎదుర్కోగ‌లిగింది. ఇప్ప‌టికే బెంగాల్‌లో రెండు దాఫాలుగా దీదీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో స్థానిక కొద్దోగొప్పో ప్ర‌జావ్య‌తిరేఖ‌త రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఈద‌ఫా దీదీపై ప్ర‌జా వ్య‌తిరేఖ‌త ఉంటుంద‌ని అంద‌రూ భావించారు.mamata banerjee;view;benarjee;bharatiya janata party;narendra modi;cm;local language;central government;mamta mohandas;partyవ్యూహం ఫ‌లించింది.. దీదీ గెలుపున‌కు కార‌ణాలివే!వ్యూహం ఫ‌లించింది.. దీదీ గెలుపున‌కు కార‌ణాలివే!mamata banerjee;view;benarjee;bharatiya janata party;narendra modi;cm;local language;central government;mamta mohandas;partySun, 02 May 2021 16:50:01 GMTకేంద్రంలో ఉన్న బీజేపీ ముప్పేట దాడిచేసింది.. అమిత్‌షా, మోదీ ద్వయం బెంగాల్‌లో గెలుపుకోసం పాగా వేశారు.. త‌న మ‌నుషులు అనుకున్న‌వాళ్లు ప్ర‌త్య‌ర్థి పార్టీలోకి వెళ్లిపోయారు.. ఇక దీదీ ప‌నైపోయింది.. అమిత్‌షా క‌న్ను బెంగాల్‌పై ప‌డింది  ఇదీ దేశ‌వ్యాప్తంగా సాగిన చ‌ర్చ‌.. అయినా ఎక్క‌డా మ‌మ‌తా బెన‌ర్జీ వెనుదిర‌గ‌లేదు.. అన్నింటిని త‌ట్టుకుంటూ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగింది.. చివ‌రికి 200కుపైగా స్థానాల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం పీఠాన్ని దీదీ అదిరోహించ‌బోతోంది.

ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త బెన‌ర్జీ గెలుపున‌కు అనేక కార‌ణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె వ్యూహాల‌కు తోడు వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు తోడ‌వ్వ‌డంతో బ‌ల‌మైన బీజేపీని స‌మ‌ర్థ‌వంతంగా దీదీ ఎదుర్కోగ‌లిగింది. ఇప్ప‌టికే బెంగాల్‌లో రెండు దాఫాలుగా దీదీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో స్థానిక కొద్దోగొప్పో ప్ర‌జావ్య‌తిరేఖ‌త రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఈద‌ఫా దీదీపై ప్ర‌జా వ్య‌తిరేఖ‌త ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఓట‌ర్లు ఆమెకే ప‌ట్టంక‌ట్టారు. ప్ర‌ధానంగా లాక‌ల్ - నాన్ లోక‌ల్ నినాదం అక్క‌డ బ‌లంగా ప‌నిచేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆ నినాదం కూడా బీజేపీ నుంచే తీసుకున్నారు మమతా బెనర్జీ. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మీద మమతా పోటీ చేయడంతో స్పందించిన సువేందు.. దీదీని నాన్ లోకల్ అంటూ అభివర్ణించారు. తాను నందిగ్రామ్‌కు లోకల్ అని కామెంట్ చేశారు. అదే పాయింట్‌ను మమతా అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన ప్ర‌చారంలో దీదీ ఇదే నినాదాన్ని ఎత్తుకొని బీజేపీ నాన్ లోక‌ల్ ప్ర‌జ‌ల ముందు ఉంచారు.

మ‌మ‌తా గెలుపున‌కు సానుభూతికూడా ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. నందిగ్రామ్‌కు ఆమె ప్ర‌చారానికి వెళ్లిన స‌మ‌యంలో కాలుకు తీవ్ర‌గాయ‌మైంది. అయితే త‌న‌పై బీజేపీ దాడి చేయించింద‌ని, ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ వచ్చి మీబిడ్డ‌నైన త‌న‌పై దాడి చేస్తున్నారంటూ ప్ర‌జ‌ల్లోకి మ‌మ‌త బ‌లంగా తీసుకెళ్ల‌గ‌లిగారు. అంతేకాకుండా దాడి జ‌రిగిన రోజు నుంచి వీల్ చైర్‌లోనే రాష్ట్రం మొత్తం ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. దీనికితోడు వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు తోడ‌వ్వ‌డంతో మ‌మ‌త గెలుపు సునాయాస‌మైంది. ఫ‌లితంగా 200కుపైగా స్థానాల్లో టీఎంసీ అభ్య‌ర్థులు గెలుపొందారు. మూడ‌వ సారి సీఎంగా మ‌మ‌తా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూత్ ని మైమరిపిస్తున్న సాంగ్...

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>