PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vs-pawan-kalyan-b4244efb-6f79-4296-9d34-c45434a35962-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-vs-pawan-kalyan-b4244efb-6f79-4296-9d34-c45434a35962-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అందరి నోటా ఒకటే మాట కరోనా ను ఎలా ఎదుర్కోవాలి.. ప్రతి రోజు కాటిలో కట్టే కాలుతుంది. కరోనా వేటుకు ఎందరో బలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అయినా కరుణించలేదు కఠిన కరోనా.. ఏపీలో పరిస్థితి చూస్తే.. దయనీయంగా మారుతుంది. కరోనా వచ్చి జనిపోవడం కన్నా కూడా ఆక్సిజన్ అందలేదని, ఆసుపత్రిలో బెడ్లు దొరకలేదని చనిపోతున్నారు. ఈ విషయం పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. jagan vs pawan kalyan;pawan;kalyan;jagan;mp;kurnool;smart phone;police;kanna lakshminarayana;ycp;oxygenజగ'మొండి' ఎందుకిలా : పవన్జగ'మొండి' ఎందుకిలా : పవన్jagan vs pawan kalyan;pawan;kalyan;jagan;mp;kurnool;smart phone;police;kanna lakshminarayana;ycp;oxygenSun, 02 May 2021 10:00:00 GMTప్రస్తుతం అందరి నోటా ఒకటే మాట కరోనా ను ఎలా ఎదుర్కోవాలి.. ప్రతి రోజు కాటిలో కట్టే కాలుతుంది. కరోనా వేటుకు ఎందరో బలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అయినా కరుణించలేదు కఠిన కరోనా.. ఏపీలో పరిస్థితి చూస్తే.. దయనీయంగా మారుతుంది. కరోనా వచ్చి జనిపోవడం కన్నా కూడా ఆక్సిజన్ అందలేదని, ఆసుపత్రిలో బెడ్లు దొరకలేదని చనిపోతున్నారు. ఈ విషయం పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు.  


ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కర్నూలులో రోగులు చనిపోయినట్టు భావిస్తున్న ఆసుపత్రికి అనుమతులు కూడా లేవని తెలిసిందని, పోలీసులు వెళ్లి తనిఖీ చేస్తే గానీ ఐసీయూలో రోగులు చనిపోయిన విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. దీన్నిబట్టి అనుమతులు లేని ఆసుపత్రుల దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్న ఏమి తెలియనట్లు ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గు చేటు అంటూ అయన ధ్వజమెత్తారు.


ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు సమకూర్చడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో, రోగులు అనుమతుల్లేని ఆసుపత్రులకు వెళుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ వ్యక్తిగత ప్రచారానికి కోట్లు ఖర్చు చేయడం మాని, ఆ నిధులను వైద్య ఆరోగ్య శాఖలో సదుపాయాల కల్పనకు తరలించాలని హితవు పలికారు. పైగా రాష్ట్రంలో 104 సేవలు సరిగ్గా లేవని ప్రజలు గగ్గోలుపెడుతున్నారని, సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఫోన్ చేస్తేనే 104 నుంచి స్పందన లేదని అన్నారు. ఆక్సిజన్ లేదు, బెడ్లు దొరకవు, 104 పనిచేయదు, అంబులెన్సులు రావు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయరు... ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే సందేహం కలుగుతోందని అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి విద్యార్థులను తీర్చి దిద్దుతా అని పరీక్షలను నిర్వహించడం ఏంటి అంటూ దుమారం రేపే వ్యాఖ్యలను చేశారు.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కరోనా టెర్రర్.. 80వేలు దాటిన యాక్టీవ్ కేసులు..!!

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>