PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా రైతులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం వెంటనే గంటల వ్యవధిలో మీడియాలో కథనాలు రావడం గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. విచారణ చేసిన రెవెన్యూ అధికారులు సైతం భూ కబ్జా నిజమేనని చెబుతూ సోమేశ్ కుమార్ కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక రాకముందే మంత్రి ఈటల రాజేందర్ పరిధిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంటూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారుతెలంగాణetela;kcr;kumaar;eatala rajendar;telangana;chief minister;minister;etela rajender;partyఈటెల కిం కర్తవ్యం.. శరణమా ? రణమా ?ఈటెల కిం కర్తవ్యం.. శరణమా ? రణమా ?etela;kcr;kumaar;eatala rajendar;telangana;chief minister;minister;etela rajender;partySun, 02 May 2021 11:10:00 GMTతెలంగాణ మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా రైతులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం వెంటనే గంటల వ్యవధిలో మీడియాలో కథనాలు రావడం గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. విచారణ చేసిన రెవెన్యూ అధికారులు సైతం భూ కబ్జా నిజమేనని చెబుతూ సోమేశ్ కుమార్ కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక రాకముందే మంత్రి ఈటల రాజేందర్ పరిధిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంటూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పుడు ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కింకర్తవ్యం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఈటెల నివాసానికి చాలామంది వెళ్లి మద్దతు తెలియజేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా తమ నాయకుడి మీద ఆరోపణలు చేస్తున్నారని కావాలని కుట్రపన్ని ఆయనను పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ భవితవ్యంపై నియోజకవర్గంలో పలువురు కార్యకర్తలు, సన్నిహితులతో మంత్రి రాజేంద్ర సమాలోచనలు జరిపారు అని తెలుస్తోంది.

 ఇక మీదట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎలా ముందుకు నడుద్దాం..? అనే విషయం గురించి తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజలే తన బాస్‌లు అని వారి నిర్ణయం ప్రకారమే తన నిర్ణయాలుంటాయని ఆయన నిన్న ప్రకటించడంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక మీదట శరణమా ? రణమా అనేది ఈరోజు రేపటిలో సర్కారు తీసుకునే నిర్ణయం మీద ఆధార పడి ఉంటుందని అంటున్నారు. అసలు పార్టీ నుండి ఈటలను తప్పిస్తారా ? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తప్పిస్తే ఈటల  ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>