PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpa4a2bde6-ac59-4463-8e02-854ae3514f8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpa4a2bde6-ac59-4463-8e02-854ae3514f8d-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి క‌నీసం 25వేల ఓట్ల మార్క్ అయినా దాటుతాడాఅన్నసందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల దుబ్బాక ఉప ఎన్నిక‌లు, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో గెలుపుబావుటా ఎగుర‌వేసిన బీజేపీ నేత‌లు.. ఇక తెలంగాణ మాదే అంటూ సాగ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయితే సాగ‌ర్‌లో గ‌ట్టిఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భావం గాలివాట‌మేనా అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. BJP;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;minister;janareddy;dookudu;partyసాగ‌ర్‌లో తేలిపోయిన బీజేపీ ..! ఆ రెండుచోట్ల గాలివాట‌మేనా?సాగ‌ర్‌లో తేలిపోయిన బీజేపీ ..! ఆ రెండుచోట్ల గాలివాట‌మేనా?BJP;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;minister;janareddy;dookudu;partySun, 02 May 2021 11:50:51 GMTతెలంగాణ‌లో అధికార తెరాస పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమేనంటూ, 2024 నాటికి మాదే అధికారం అంటూ దూకుడును ప్ర‌దర్శిస్తున్న బీజేపీ నాగార్జున సాగ‌ర్‌లో తేలిపోయింది. క‌నీస పోటీకూడా ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ప‌ది రౌండ్లు పూర్త‌యినా నాలుగు వేల ఓట్లుకూడా ఆ పార్టీ అభ్య‌ర్థికి ప‌డ‌క‌పోవ‌టం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, ఆపార్టీ ఎంపీలు, ఇత‌ర నేత‌లంతా నాగార్జున సాగ‌ర్ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్నారు. గెలిచేది మేమే అంటూ టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. అయినా బీజేపీ నేత‌ల మాట‌ల‌ను సాగ‌ర్ ఓట‌ర్లు ప‌ట్టించుకోలేదు.

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి క‌నీసం 25వేల ఓట్ల మార్క్ అయినా దాటుతాడాఅన్నసందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల దుబ్బాక ఉప ఎన్నిక‌లు, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో గెలుపుబావుటా ఎగుర‌వేసిన బీజేపీ నేత‌లు.. ఇక తెలంగాణ మాదే అంటూ సాగ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయితే సాగ‌ర్‌లో గ‌ట్టిఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భావం గాలివాట‌మేనా అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. నిజానికి తెలంగాణ‌లో ప్ర‌స్తుతం బీజేపీ ప్రాబ‌ల్యం అంత‌గా లేదు. కేవ‌లం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మాత్ర‌మే ఆ పార్టీ కొద్దిప‌ట్టు సాధించింది. రూర‌ల్ ఏరియాల్లో బీజేపీకి క‌నీస క్యాడ‌ర్ కూడా లేదు. ఈ అంశాలే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వానికి కార‌ణాలుగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

నాగార్జున సాగ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండ‌టం కూడా బీజేపీకి దెబ్బ‌గా విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాంగ్రెస్ త‌ర‌పున ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జానారెడ్డి బ‌రిలో నిలిచాడు. అధికార పార్టీకి ఆయ‌న గ‌ట్టిపోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ సాగ‌ర్ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొంద‌లేక‌పోయారు. కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ గ్రామాన క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ  అధికార తెరాస దాటికి జానారెడ్డి రెండ‌వ స్థానంకు ప‌రిమిత‌య్యాడు. ఈ క్ర‌మంలో బీజేపీ క‌నీస ఓట్లు సాధించేందుకు తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>