NRISuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/coronavirus33a67bf0-33a2-4d8a-9a47-a19447c4160a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/coronavirus33a67bf0-33a2-4d8a-9a47-a19447c4160a-415x250-IndiaHerald.jpgఇండియా కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న నేపథ్యంలో విదేశాల్లో నివసించే భారతీయులు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే భారత అమెరికన్ సంఘాలు ఆర్థిక సహాయం చేసేందుకు పూనుకున్నాయి. సేవ ఇంటర్నేషనల్ ఎన్జీవోస్ సంస్థ 5 మిలియన్ డాలర్లను సేకరించి ఇండియాకి పంపించాలని నిశ్చయించింది. ఐతే ఈ సంస్థకు ఇప్పటికే ఒక లక్షా 50 వేల డాలర్ల విరాళాలు అందాయి. హెల్ప్ ఇండియా డిఫీట్ covid-19 ప్రచారం మొదలు పెట్టి 400 వందల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారతదేశానికి పంపించేందుకు కూడా ఈ సేవా సంస్థ సిద్ధమయ్యింది. అయితcoronavirus;koti;india;canada;american samoa;microsoft;google;service;international;oxygenరూ.16.5 కోట్ల విరాళాలందించిన ఎన్నారైలు..!రూ.16.5 కోట్ల విరాళాలందించిన ఎన్నారైలు..!coronavirus;koti;india;canada;american samoa;microsoft;google;service;international;oxygenSat, 01 May 2021 09:00:00 GMTఇండియా కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న నేపథ్యంలో విదేశాల్లో నివసించే భారతీయులు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే భారత అమెరికన్ సంఘాలు ఆర్థిక సహాయం చేసేందుకు పూనుకున్నాయి. సేవ ఇంటర్నేషనల్ ఎన్జీవోస్ సంస్థ 5 మిలియన్ డాలర్లను సేకరించి ఇండియాకి పంపించాలని నిశ్చయించింది. ఐతే ఈ సంస్థకు ఇప్పటికే ఒక లక్షా 50 వేల డాలర్ల విరాళాలు అందాయి. హెల్ప్ ఇండియా డిఫీట్ కోవిడ్-19 ప్రచారం మొదలు పెట్టి 400 వందల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారతదేశానికి పంపించేందుకు కూడా ఈ సేవా సంస్థ సిద్ధమయ్యింది.

అయితే అమెరికా ప్రవాసులతో పాటు బ్రిటన్ ప్రవాసులు కూడా భారత దేశానికి సహాయం అందించేందుకు నడుంబిగించారు. "బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్" ఆక్సిజన్ ఫర్ ఇండియా అనే ప్రచారం పేరుతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నది. బ్రిటిష్ ఇండియన్స్ మరొక క్యాంపెయిన్ "గో ఫండ్ మీ" నిర్వహిస్తూ 16 లక్షల పౌండ్లను సేకరించారు. అంటే మన కరెన్సీలో రూ. 16.5 కోట్లు అన్నమాట. ఈ విరాళాలు ఉపయోగించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి పంపిణీ చేస్తామని బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.

ఇకపోతే భారతదేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3 లక్షల 86 వేల కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మరణాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న కరోనా తో 3000 కు పైగా మృతి చెందారు. ప్రవాసులతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు భారతదేశానికి కోట్ల రూపాయలను అందిస్తున్నాయి. క్రీడాకారుల సైతం భారతీయుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయి లక్షల రూపాయలు విరాళాలు అందించారు. కెనడా ప్రభుత్వం ఏకంగా కోటి డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ విధంగా అంతర్జాతీయ సమాజం భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి ఈటల ఆసక్తికర ట్వీట్..!!

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>