CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deadc4bf2dd6-95dc-46ea-9687-a76ae426a45a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/deadc4bf2dd6-95dc-46ea-9687-a76ae426a45a-415x250-IndiaHerald.jpgమరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అప్పటి వరకు ఆనందంగా మనతో గడిపిన వాళ్లే క్షణాలలో కనుమరుగైపోతున్నారు. తెల్లవారితే కూతురి పుట్టిన రోజు. బంధువులంతా ఆ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో విధి వెక్కిరించింది. గుండెపోటు రూపంలో మృత్యువు అతడిని వెంటాడింది. విషయం తెలసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది.dead;district;smart phone;police;marriage;wife;santosham;anandamతెల్లారితే కూతురు బర్త్ డే.. అంతలోనే పెను విషాదం..!తెల్లారితే కూతురు బర్త్ డే.. అంతలోనే పెను విషాదం..!dead;district;smart phone;police;marriage;wife;santosham;anandamSat, 01 May 2021 12:00:00 GMTమరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అప్పటి వరకు ఆనందంగా మనతో గడిపిన వాళ్లే క్షణాలలో కనుమరుగైపోతున్నారు. తెల్లవారితే కూతురి పుట్టిన రోజు. బంధువులంతా ఆ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో విధి వెక్కిరించింది. గుండెపోటు రూపంలో మృత్యువు అతడిని వెంటాడింది. విషయం తెలసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా మడికొండకు చెందిన బండి రంజిత్‌ కుమార్‌(35) పుట్టు మూగవాడు. అతడికి రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. అతడు రామగుండం రైల్వే రెగ్యులర్‌ ఓవర్‌ హాలింగ్‌షెడ్డులో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. ఇక కొడుకుకి మంచి ఉద్యోగం రావడంతో అతడిని ఓ ఇంటివాడిని చేయాలనీ తల్లిదండ్రులు అనుకున్నారు. ఇక అతడికి మూడు సంవత్సరాల క్రితం మూగ యువతిని పెళ్లి చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు. భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులు పండంటి బిడ్డకు జన్మానించారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అతడు తన భార్య,  కూతురును పుట్టింటికి పంపించారు. రంజిత్‌ కుమార్‌ పేరుకు మూగవాడైన అందరితో కలిసిమెలిసి చాలా సరదాగా గడిపేవాడని తన తోటి స్నేహితులు తెలిపారు. అతడు పనిచేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు.

అయితే రంజిత్ పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తెల్లారితే తన కూతురు మొదటి పుట్టిన రోజు ఉండగా తన భార్యకు ఫోన్ చేసి రామగుండం రావాలని  చెప్పాడు. ఇంతలో ఇలా జరగడంతో తన భార్య బోరున విలపించింది. రంజిత్ ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివాహిత తో అక్రమ సంబంధం.. బయటపడ్డ ప్రియదర్శిి సరికొత్త అవతారం..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>