MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya43ede0bd-7e58-46f0-934c-60454ee4bd49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya43ede0bd-7e58-46f0-934c-60454ee4bd49-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.balayya;view;balakrishna;boyapati srinu;simhaa;cinema;media;youtube;you tube;producer;producer1;hero;vegetable market;star maa;nandamuri taraka rama rao;legendఅఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!balayya;view;balakrishna;boyapati srinu;simhaa;cinema;media;youtube;you tube;producer;producer1;hero;vegetable market;star maa;nandamuri taraka rama rao;legendSat, 01 May 2021 17:20:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా విడుదలైంది. అదే రోజు ఈ చిత్రానికి 'అఖండ' అనే పవర్‌ఫుల్ టైటిల్‌‌ను ప్రకటించారు.

ఇక బాలయ్య బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అటు వ్యూస్ పరంగా.. ఇటు లైక్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ వ్యూస్ పరంగా యూట్యూబ్ లో ఏకంగా 50 మిలియన్ల మార్క్ ను దాటి కొత్త రికార్డ్స్ ను సృష్టిస్తోంది.

కాగా అఖండ శాటిలైట్ డీల్ కూడా కుదుర్చుకుందని తెలుస్తోంది. భారీ మొత్తానికి అనగా 19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకుందట. దీంతో సోషల్ మీడియా వేదికగా టీజర్‌పై చర్చ జరుగుతోంది. ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరో బాలయ్య అంటూ ఆయన ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో అధికారిక అప్ డేట్ వచ్చే వరకూ నమ్మలేం.

అయితే బోయపాటి బ్రాండ్ కూడా ఈ సినిమాకి లభిస్తోన్న భారీ మార్కెట్ కు ఒక కారణం అనే చెప్పాలి. ఇక మొత్తానికి బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూడో మూవీకి భారీ రేట్లు పలుకుతుండటంతో.. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి పెద్ద రిలీఫ్ లా ఉంది. ఇక సినిమాలో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు చాల బాగుంటాయట, ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ ఇస్తాడో.. లేదో చూడాలి మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్

25 ఏళ్ల చరిత్రలో నాపై ఎన్నడు ఇలా జరగలేదు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>