PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuf4d13a87-cad0-4503-b1d1-523730f1a8a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuf4d13a87-cad0-4503-b1d1-523730f1a8a2-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు వైసీపీ మంత్రులు.. త్వరలో ప్రతిప‌క్ష నేత‌ చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబు హెరిటేజ్ కోసం రాష్ట్రంలో ఉన్న పాల డెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని... సంగం డైరీ ఎవడబchandrababu;cbn;vijayawada;guntur;devineni avinash;botcha satyanarayana;telugu;vishakapatnam;government;minister;fire;muni;tdp;local language;ycp;reddy;heritage foods;mantraచంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?chandrababu;cbn;vijayawada;guntur;devineni avinash;botcha satyanarayana;telugu;vishakapatnam;government;minister;fire;muni;tdp;local language;ycp;reddy;heritage foods;mantraSat, 01 May 2021 08:16:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు వైసీపీ మంత్రులు.. త్వరలో ప్రతిప‌క్ష నేత‌ చంద్రబాబుకు  చిప్పకూడు ఖాయమని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు హెరిటేజ్ కోసం రాష్ట్రంలో ఉన్న పాల డెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని... సంగం డైరీ ఎవడబ్బ సొత్తు అని ధూళిపాళ్ళ తన జేబు సంస్థగా మార్చుకున్నాడని  మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు గత టిడిపి నాయకులని... గత తెలుగుదేశం పార్టీలో నాయకులు దోచుకున్న సొమ్ము ప్రజలకు అప్పగించడమే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి లక్ష్యమని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.  

మరో మంత్రి బొత్స కూడా నిప్పులు చెరిగారు.. మా ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభించింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఈ మూడు ప్రాంతాల ప్రజలు తమ ఓట్ల ద్వారా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు స్థానిక ఎన్నికల ప్రచారంలో విశాఖ, విజయవాడ, గుంటూరులో ప్రజలనుద్దేశించి మీకు పౌరుషం లేదా? సిగ్గు లేదా? అంటూ రెచ్చగొట్టారు. అయినా కూడా ప్రజలు విజ్ఞతతోనే తమ తీర్పు ఇచ్చారు. ఇంకా మా ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆడిపోసుకోవడం మానుకోలేదన్నారు  బొత్స.  

 చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి దానికి తందానా అనే వారిని కుర్చోబెట్టుకుని, ఒక ప్రాంతానికి చెందిన వారి ప్రయోజనాలే పరమార్థంగా, అందులోనూ తన బినామీలకు ఎటువంటి నష్టం రాకూడదనే ధ్యేయంతో పని చేస్తున్నాడు. చంద్రబాబు ఈ సమాజం గురించి కాదు.. కేవల తన సామాజికవర్గం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఒక టెంట్‌ వేసి నలుగురిని కూర్చోబెట్టి, చంద్రబాబుకు జై అంటూ నినాదాలు చేయించి, దాన్ని ఉద్యమం అంటే ఎవరు అంగీకరిస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుజరాత్‌లో ఘోర ప్రమాదం..!!

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి ఛాన్స్ ఉందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టెన్షన్ పెంచేస్తున్న ఎగ్జిట్ పోల్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>