PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgటీయారెస్ అలాంటి ఇలాంటి పార్టీ కాదు, దానికి ఒక చరిత్ర ఉంది. సాధారాణంగా పార్టీల పుట్టుక వెనక అసలైన ఉద్దేశ్యం అధికారమే. రాజకీయాలు చేయడం కోసమే. కానీ టీయారెస్ ఒక పవిత్ర ఆశయం భుజాన వేసుకుంది. అప్పటిదాకా సాకారం కాని తెలంగాణాను తీసుకురావాలన్నదే ఆ పవిత్ర ఆశయం. ఆ మార్గంలో తనతో కలసి వచ్చిన వారిని అందరికీ తీసుకుని ముందుకు సాగిపోయింది. etela;kcr;tara;y. s. rajasekhara reddy;రాజీనామా;backward classes;history;etela rajender;partyగులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?గులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?etela;kcr;tara;y. s. rajasekhara reddy;రాజీనామా;backward classes;history;etela rajender;partySat, 01 May 2021 20:25:58 GMTటీయారెస్ అలాంటి ఇలాంటి పార్టీ కాదు, దానికి ఒక చరిత్ర ఉంది. సాధారాణంగా పార్టీల పుట్టుక వెనక అసలైన ఉద్దేశ్యం అధికారమే. రాజకీయాలు చేయడం కోసమే. కానీ టీయారెస్ ఒక పవిత్ర ఆశయం భుజాన వేసుకుంది. అప్పటిదాకా సాకారం కాని తెలంగాణాను తీసుకురావాలన్నదే ఆ పవిత్ర ఆశయం. ఆ మార్గంలో తనతో కలసి వచ్చిన వారిని అందరికీ తీసుకుని ముందుకు సాగిపోయింది.

టీయారెస్ లో తొలి నుంచి ఉన్న వారిలో ఈటెల రాజేందర్ ఒకరు. ఆయన బీసీ నేత. సమర్ధుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు మంచి సబ్జెక్ట్ ఈటెల సొంతం. ఈటెల రాజెందర్ నాడు తెలంగాణా ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అంతే కాదు ఆయన నాడు వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడి అందరికీ ఆకట్టుకున్నారు. కేసీయార్ పిలుపు మేరకు పలు మార్లు రాజీనామా చెసి ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించిన చరిత్ర ఈటెల సొంతం.

ఇక ఈటెలకు తెలంగాణాలో మంచి మద్దతు కూడా ఉంది. ముందే చెప్పుకున్నట్లుగా ఆయన బీసీ నేత కావడంతో బడుగుల గొంతుకగా నిలిచారు. ఆయనను తెలంగాణా వాసులంతా ఇష్టపడతారు. ఈటెల తనకు ఏ శాఖ అప్పగించినా కూడా చాలా సమర్ధంగా పనిచేసేవారు. గతంలో  ఆర్ధిక శాఖను కూడా చాకచక్యంగా నిర్వహించి కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక గత రెండేళ్ళుగా వరసగా కరోనా మహమ్మారి దేశంలో విరుచుకుపడుతున్న సమయాన ఈటెల ఆరోగ్యం మంత్రిగా కూడా తమదైన శైలిలో పనిచేస్తున్నారు అన్న మాట అయితే ఉంది.

ఈ టైమ్ లో ఈటెల మీద ఆరోపణలు రావడం ఆయన్ని ఆగోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తప్పించడం మాత్రం చర్చనీయాశంగానే ఉంది. గులాబీకి కొన్ని రేకులు ఉంటే వాటిలో ఈటెల కూడా ఒకరు. ఆయన గతంలో చెప్పినట్లుగా టీయారెస్ కి తానూ ఒక ఓనర్ని అని కూడా భావిస్తారు. ఈటెల వంటి సీనియర్ నేతను తప్పించడం అంటే  టీయారెస్ కి కొంత ఇబ్బందే. అది సామాజికంగా రాజకీయంగా కూడా నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అయితే కేసీయర్ రాజకీయ దురంధరుడు కాబట్టి ఈటెల ఆయన్ని ఢీ కొట్టి ఎంతవరకూ ముందుకు సాగుతారు అన్నది మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఏది ఏమైనా గులాబీ తోటకు ఈటెల ముళ్ళు గట్టిగానే తగులుతాయి అన్నదే విశ్లేషణగా ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>