PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన తమ భూములు ఆక్రమించుకున్నాడు అంటూ మెదక్ జిల్లాకు చెందిన కొంత మంది రైతులు మీడియాకెక్కారు. నిన్న సాయంత్రం ఈ అంశం హైలెట్ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు కూడా ఆదేశించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ తన మీద ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని చెప్పుకొచ్చారు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్న ఆయన ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తన ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం కంetela;kcr;hyderabad;eatala rajendar;telangana;media;chief minister;minister;press;central government;medak;etela rajender;huzurabadహైదరాబాదు రావద్దు : ఈటెలహైదరాబాదు రావద్దు : ఈటెలetela;kcr;hyderabad;eatala rajendar;telangana;media;chief minister;minister;press;central government;medak;etela rajender;huzurabadSat, 01 May 2021 07:00:00 GMTతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయన తమ భూములు ఆక్రమించుకున్నాడు అంటూ మెదక్ జిల్లాకు చెందిన కొంత మంది రైతులు మీడియాకెక్కారు. నిన్న సాయంత్రం ఈ అంశం హైలెట్ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు కూడా ఆదేశించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈటల రాజేందర్ తన మీద ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని చెప్పుకొచ్చారు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్న ఆయన ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తన ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం కంటే పదవి ఏమాత్రం పెద్దది కాదని ఆయన చెప్పుకొచ్చారు.


 స్కూటర్ వేసుకుని హైదరాబాద్ వచ్చిన వాళ్లు ఇవాళ కోట్లు ఎలా సంపాదించారు చెప్పాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు మరో సారి ప్రెస్ మీట్ పెడతానంటూ ఈటెల రాజేంద్ర చెప్పడంతో ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆయన నియోజకవర్గానికి చెందిన ప్రజలు, ఆయన శ్రేయోభిలాషులు హైదరాబాద్ వస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉండటంతో ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. "'హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇదే నా విన్నపం, నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు సంయమనం పాటించాలి, ఇది కరోనా సమయం కాబట్టి ఎవరో హైదరాబాదు రావద్దు అని ఆయన కోరారు.

అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఈటెల రాజేంద్ర సమర్థిస్తూ మాట్లాడడమే ఆయన కొంప ముంచింది అనే ప్రచారం జరుగుతోంది.. ఒక పక్క కెసిఆర్ సహా మిగతా నేతలు అందరూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని ఆరోపణలు గుప్పిస్తోన్న సమయంలో ఈటెల రాజేందర్ మాత్రం అడిగిన దాని కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇస్తోడ్నాని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి ఛాన్స్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>