PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetela-rajendar-land-poolingaa2ce6de-8439-45a3-89e1-8a73923b84dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetela-rajendar-land-poolingaa2ce6de-8439-45a3-89e1-8a73923b84dc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ దశలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఒక భూ కబ్జా వివాదం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాకు పాల్పడ్డారని మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఫిర్యాదు పత్రాన్ని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించడం జరిగింది.EETELA RAJENDAR LAND POOLING;kcr;bharatiya janata party;eatala rajendar;telangana;congress;district;government;huzur nagar;mandalam;chief minister;minister;letter;medak;karimnagar;petta;etela rajender;vఈటల రాజేందర్ వ్యవహారంతో నేతల గుండెల్లో గుబులు ?ఈటల రాజేందర్ వ్యవహారంతో నేతల గుండెల్లో గుబులు ?EETELA RAJENDAR LAND POOLING;kcr;bharatiya janata party;eatala rajendar;telangana;congress;district;government;huzur nagar;mandalam;chief minister;minister;letter;medak;karimnagar;petta;etela rajender;vSat, 01 May 2021 14:00:00 GMTప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ దశలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఒక భూ కబ్జా వివాదం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాకు పాల్పడ్డారని మెదక్ జిల్లా  మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఫిర్యాదు పత్రాన్ని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించడం జరిగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో తెలంగాణ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగింది. ఈ విషయంపై కేసీఆర్ కనీసం ఒక్క మాట కూడా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ని అడగకుండా విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు అందరి దృష్టి   విషయంపైనే నెలకొంది. దీనితో ఈటల రాజేందర్ కార్యకర్తలు మరియు అభిమానులు ఇది కేవలం కుట్రపూరితంగానే జరుగుతోందని ఆరోపిస్తూ కరీంనగర్ హై వేపై బైఠాయించారు. 

దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ నా మీద పక్కాగా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. నేను ఏమిటో ప్రజలకు తెలుసని ఈ సందర్భంగా తెలియచేశారు. ఏవైతే తనపై ఆరోపణాలు వచ్చాయో సీఎస్, విజిలెన్సు మరియు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఇలా ఉంటే ఈ విషయంపై కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హెచ్ హనుమంత రావు మాట్లాడుతూ, "ఇలా జరగడం ఇప్పుడే కొత్త కాదు రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణంగా జరగడం మనము చూస్తూనే ఉన్నాము.

గతంలో చాలా సార్లు కొంతమంది నాయకులకు సంబంధించిన అవినీతి వీడియోలు సైతం బయట పడ్డాయి..వారి విషయంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా ? ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే వాస్తవంగా ఏమి జరిగిందో విచారణలో తెలుస్తాయి. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండడం మంచిది అని మీడియాతో చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు సైతం ఎలాగూ ఇంతదూరం వచ్చింది కాబట్టి... కేసీఆర్ ఆస్తులపైన కూడా విచారణ జరగాలి అని కామెంట్ చేస్తున్నారు. ఇలా ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని రాజకీయనాయకుల ఆస్తులపైన కూడా విచారణకు ఆదేశిస్తారేమోనని పలువురు అవినీతి రాజకీయ నాయకులు భయంతో గడగడలాడిపోతున్నారు. ఇకపై ఈ వ్యవహారంలో భాగంగా ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

 






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ నటుడిని పొట్టనపెట్టుకున్న మహమ్మారి.. శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>