PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etelaa801fc04-c9bd-4242-b620-e8223682d2e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etelaa801fc04-c9bd-4242-b620-e8223682d2e8-415x250-IndiaHerald.jpgతాజా ప‌రిణామాల‌తో ఈట‌ల‌కు కేసీఆర్ అన్యాయం చేశాడంటూ, ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నాడంటూ ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్య‌మ స‌మ‌యం నుండి ఈట‌ల పార్టీలో ఉంటూ కేసీఆర్‌కు అండ‌గా నిలిచాడ‌ని, కానీ ఇప్పుడు అదే కేసీఆర్ ఈట‌ల‌ను బ‌ల‌వంతంగా పార్టీ నుంచి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌నిetela;kcr;ganga;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;telangana;mp;mla;minister;v hanumantharao;party;mantraఈట‌ల‌కు ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు .. ! నోరు మెద‌ప‌ని తెరాస నేత‌లుఈట‌ల‌కు ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు .. ! నోరు మెద‌ప‌ని తెరాస నేత‌లుetela;kcr;ganga;bharatiya janata party;telangana rashtra samithi trs;ganges;telangana;mp;mla;minister;v hanumantharao;party;mantraSat, 01 May 2021 16:56:21 GMTతెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణ‌యం సంచ‌ల‌నాత్మ‌కంగా మారుతుంది. ఊహించ‌ని రీతిలో కేసీఆర్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. నిన్న‌టికినిన్న ఈట‌ల రాజేంద‌ర్ పై ప‌లు ఛానెల్స్‌లో భూ క‌బ్జాల ఆరోప‌ణ‌లు రావ‌డంతో విచార‌ణ‌కు ఆదేశించిన కేసీఆర్.. తాజాగా ఈట‌ల శాఖ‌ల‌ను త‌న‌కు బ‌ద‌లాయింప‌జేసుకున్నారు. వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌స్తుతం కీల‌కంగా మారింది. క‌రోనా ఉధృతి స‌మ‌యంలో ఆశాఖ‌ను ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద ప్ర‌మాద‌మే పొంచి ఉంటుంది. ఈ క్ర‌మంలో కేసీఆరే ఆ శాఖ‌ల‌ను త‌న‌కు బ‌ద‌లాయింప‌జేసుకొని వెంట‌నే స‌మీక్ష‌లు నిర్వ‌హించి క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తాజా ప‌రిణామాల‌తో ఈట‌ల‌కు కేసీఆర్ అన్యాయం చేశాడంటూ, ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నాడంటూ ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్య‌మ స‌మ‌యం నుండి ఈట‌ల పార్టీలో ఉంటూ కేసీఆర్‌కు అండ‌గా నిలిచాడ‌ని, కానీ ఇప్పుడు అదే కేసీఆర్ ఈట‌ల‌ను బ‌ల‌వంతంగా పార్టీ నుంచి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని బీజేపీ ఎంపీ అర‌వింద్‌కుమార్‌, కోదండ‌రాం, విశ్వేశ్వ‌ర‌రెడ్డి, వీహెచ్ హ‌న్మంతురావు, జీవ‌న్‌రెడ్డి తో పాటు ప‌లువురు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. అంతేకాక ఈట‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఈట‌ల‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ప‌లువురు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఈట‌ల‌తో ఫోన్‌లో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈట‌ల‌పై సీఎం కేసీఆర్ నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టం తెరాస‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ఈట‌ల‌పై వ‌చ్చిన భూ క‌బ్జాల ఆరోప‌ణ‌లపై నిజానిజాలు నిగ్గుతేల్చాల‌ని అధికారుల‌ను కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ప‌రిణామాల‌పై ఏఒక్క మంత్రి కానీ, తెరాస ఎమ్మెల్యే, ప్ర‌జాప్ర‌తినిథులు స్పందించేందుకు సాహ‌సించ‌డం లేదు. ఒక‌రికొక‌రు ఫోన్‌లు చేసుకొని తాజా విష‌యాల‌పై చ‌ర్చించుకుంటున్నారుత‌ప్ప.. ఈట‌ల గురించి బ‌హిరంగంగా ప్ర‌స్తావించేందుకు సైతం వెనుక‌డుగు వేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈట‌లకు మ‌ద్ద‌తు నిలిచి న‌ష్ట‌పోవ‌టం కంటే.. సైలెంట్‌గా ఉండ‌ట‌మే మేల‌న్న రీతిలో  మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ముఖ్య‌నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>