PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0dc91149-ec2e-45ab-8d71-79c204bc2850-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0dc91149-ec2e-45ab-8d71-79c204bc2850-415x250-IndiaHerald.jpgకరోనా.. అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా బారిన పడుతున్నవారిలో పాత్రికేయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. విధినిర్వహణ కోసం నిత్యం ప్రజల మధ్యన తిరిగే పాత్రికేయులు ఇప్పుడు కరోనాకు టార్గెట్ అవుతున్నారు. ప్రత్యేకించి కరోనా వార్తల కవరేజ్‌లో ఆసుపత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ తిరగడం జర్నలిస్టులకు తప్పనిసరి అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో అనేక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ఇబ్బందిపడే పాత్రికేయులకు వైjagan;kiran kumar;kumaar;kiran;nithya new;jagan;andhra pradesh;district;smart phone;good news;good newwzకనికరోనా : జర్నలిస్టులకు జగన్ గుడ్ న్యూస్..!కనికరోనా : జర్నలిస్టులకు జగన్ గుడ్ న్యూస్..!jagan;kiran kumar;kumaar;kiran;nithya new;jagan;andhra pradesh;district;smart phone;good news;good newwzSat, 01 May 2021 10:00:00 GMTకరోనా.. అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా బారిన పడుతున్నవారిలో పాత్రికేయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. విధినిర్వహణ కోసం నిత్యం ప్రజల మధ్యన తిరిగే పాత్రికేయులు ఇప్పుడు కరోనాకు టార్గెట్ అవుతున్నారు. ప్రత్యేకించి కరోనా వార్తల కవరేజ్‌లో ఆసుపత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ తిరగడం జర్నలిస్టులకు తప్పనిసరి అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో అనేక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

కరోనాతో ఇబ్బందిపడే పాత్రికేయులకు వైద్య సేవలు అందించాలన్ని అనేక మంది జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తికి ఏపీ సర్కారు స్పందించింది. కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ నోడల్ అధికారులు సంబంధిత జిల్లాలలో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షల నిర్వహణ నుంచి వైద్యం అందించటం, కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునే వరకు సహాయకారిగా ఉంటూ అన్ని అవసరమైన వైద్య చర్యలు తీసుకుంటారు.

పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ ను నియమించారు.. ఆయన మొబైల్ నెం: 9121215223.  ప్రతి జిల్లాలో సమాచార శాఖ ఉపసంచాలకులు , సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి ఎల్ల వేళలా వారికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాత్రికేయుల విధినిర్వహణను దృష్టిలో ఉంచుకొని వారికి  టీకా వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా నోడల్ అధికారులకు సూచనలు ఇచ్చారు.

కోవిడ్-19 బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి  రూ. 5 లక్షలు సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు ఫారం మరియు అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లను జిల్లాలోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>