PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kagitha22c60e80-4d94-4085-bb40-e567847894bf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kagitha22c60e80-4d94-4085-bb40-e567847894bf-415x250-IndiaHerald.jpgకాగిత వెంకట్రావు...తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాగిత, తాజాగా అనారోగ్యంతో మరణించారు. దీంతో కృష్ణా జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలనట్లైంది. ముఖ్యంగా పెడన నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. 2014లో పెడన ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత, మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల్లో ఆయనకు పదవి దక్కలేదు. దీంతో ఆయన పూర్తి నిరాశపడ్డారు. అయినా సరే పార్టీ మారకుండా పనిచేసుకుంటూ వచ్చారు.kagitha;krishna river;korcha;jagan;2019;mp;district;telugu;minister;cheque;konakalla narayana rao;krishna district;tdp;local language;pedana;varasudu;partyకాగిత వారసుడుకు ఛాన్స్ లేకుండా చేస్తారా?కాగిత వారసుడుకు ఛాన్స్ లేకుండా చేస్తారా?kagitha;krishna river;korcha;jagan;2019;mp;district;telugu;minister;cheque;konakalla narayana rao;krishna district;tdp;local language;pedana;varasudu;partySat, 01 May 2021 04:00:00 GMTకాగిత వెంకట్రావు...తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాగిత, తాజాగా అనారోగ్యంతో మరణించారు. దీంతో కృష్ణా జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలనట్లైంది. ముఖ్యంగా పెడన నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. 2014లో పెడన ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత, మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల్లో ఆయనకు పదవి దక్కలేదు. దీంతో ఆయన పూర్తి నిరాశపడ్డారు. అయినా సరే పార్టీ మారకుండా పనిచేసుకుంటూ వచ్చారు.


మధ్యలో అనేక పార్టీలు రమ్మని ఆహ్వానించినా టీడీపీని వదలలేదు. ఇక 2019లో ఆరోగ్య కారణాలతో పోటీలో దిగకుండా, తన తనయుడు కృష్ణప్రసాద్‌ని బరిలో దించారు. కానీ అనూహ్యంగా కృష్ణప్రసాద్ ఓటమి పాలయ్యారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పెడనలో టీడీపీకి మంచి ఫలితాలు రాలేదు. ఇలా టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలోనే వెంకట్రావు మరణించారు. దీంతో ఆయన తనయుడు కృష్ణప్రసాద్ పెడనలో ఏ విధంగా నెట్టుకొస్తారనేది తెలియడం లేదు.


దీనికితోడు కృష్ణప్రసాద్ టిక్కెట్‌కే ఎసరు పెట్టాలని పక్కనే మచిలీపట్నంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఫ్యామిలీ చూస్తుంది. 2019 ఎన్నికల్లోనే పెడన టిక్కెట్ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు, కాగిత ఫ్యామిలీని వదలలేదు. కాగిత వారసుడుకే టిక్కెట్ ఇచ్చారు. జగన్ వేవ్‌లో కృష్ణప్రసాద్ ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు వెంకట్రావు చనిపోయారు. దీంతో కాగిత వారసుడుకు చెక్ పెట్టాలని సొంత పార్టీ వాళ్లే కాచుకుని కూర్చున్నారు.


ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పెడన టిక్కెట్ దక్కించుకోవాలని కొనకళ్ళ ఫ్యామిలీ రెడీ అవుతుంది. అయితే పెడనలో కాగిత వర్గం బలంగానే ఉంది. పైగా వెంకట్రావు లేకపోవడంతో ఆయన వారసుడుకు న్యాయం చేయాలని టీడీపీ అధిష్టానం ఆలోచించే అవకాశం ఉంది. దీని బట్టి చూస్తే కాగిత వారసుడుకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందనే చెప్పొచ్చు.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పంతం నీదా నాదా 'సై:.?

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>