PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling-ae764864-a5a0-4a03-b079-b83cf85639b7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling-ae764864-a5a0-4a03-b079-b83cf85639b7-415x250-IndiaHerald.jpgఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 57.91శాతం ఓటింగ్ న‌మోదు కాగా, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో 49.25 శాతం, కొత్తూరు మున్సిపాలిటీలో 85.42, న‌కిరేక‌ల్లో 86.65శాతం, అచ్చంపేట మున్సిపాలిటీలో 68.80, జ‌డ్చ‌ర్ల‌లో 66.10శాతం, సిద్ధిపేట మున్సిపాలిటీలో 67.18 శాతం పోలింగ్ న‌మోదైంది. న‌రికేక‌ల్‌, కొత్తూరు మున్సిపాలిటీల్లో మిన‌హా మిగిలిన రెండు కార్పొరేష‌న్‌లు, మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌శాతం త‌క్కువ‌గా న‌మోదైంది.polling;telangana rashtra samithi trs;minister;petta;partyత‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!polling;telangana rashtra samithi trs;minister;petta;partySat, 01 May 2021 06:01:00 GMTరాష్ట్ర వ్యాప్తంగా శుక్ర‌వారం రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. క‌రోనా విజృంభిస్తున్న వేళ పూర్తిస్థాయిలో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధికారులు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఉద‌యం 7గంట‌లకు పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి పోలింగ్ మంద‌కొడిగానే సాగింది. క‌రోనా విజృంభ‌ణ‌తో అనేక‌మంది ఓట‌ర్లు ఓటేవేసేందుకు వెనుక‌డుగు వేశారు. ఫ‌లితంగా న‌కిరేక‌ల్‌, కొత్తూరు మున్సిపాలిటీల్లో మిన‌హా ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లు, జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట‌, సిద్ధిపేట మున్సిపాలిటీల్లో పోలింగ్‌శాతం త‌క్కువ‌గా న‌మోదైంది. దీంతో గెలుపు దీమా అన్ని పార్టీల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నా.. అధికార పార్టీనే రెండు కార్పొరేష‌న్‌లు, ఐదు మున్సిపాలిటీల్లో  పాగావేయ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 57.91శాతం ఓటింగ్ న‌మోదు కాగా, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో 49.25 శాతం, కొత్తూరు మున్సిపాలిటీలో 85.42,  న‌కిరేక‌ల్లో 86.65శాతం, అచ్చంపేట మున్సిపాలిటీలో 68.80, జ‌డ్చ‌ర్ల‌లో 66.10శాతం, సిద్ధిపేట మున్సిపాలిటీలో 67.18 శాతం పోలింగ్ న‌మోదైంది. న‌రికేక‌ల్‌, కొత్తూరు మున్సిపాలిటీల్లో మిన‌హా మిగిలిన రెండు కార్పొరేష‌న్‌లు, మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్‌శాతం త‌క్కువ‌గా న‌మోదైంది. త‌క్కువ‌గా న‌మోదైన పోలింగ్ ఏ పార్టీకి అనుకూలిస్తుందో అన్న చ‌ర్చ‌సాగుతుంది. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల్లోనూ తెరాస జెండా ఎగురుతుంద‌ని ప‌లు స‌ర్వేలు పేర్కొంటున్నాయి.

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో 66 డివిజ‌న్‌ల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌గా 50 నుంచి 55 స్థానాల్లో తెరాస అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తార‌ని తెరాస వ‌ర్గాలు ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి. స్వ‌ల్పంగా త‌గ్గిన పోలింగ్‌శాతం అధికార పార్టీకే అనుకూలిస్తుంద‌ని వారు పేర్కొంటున్నారు. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లోని 60 డివిజ‌న్‌ల‌లో ప‌లు చోట్ల రెబెల్స్ నుంచి అధికార పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పోలింగ్ స‌ర‌ళినిబ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక్క‌డ 45 నుంచి 50 డివిజ‌న్‌ల‌లో తెరాస జెండా ఎగుర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు సిద్ధిపేట‌లో తెరాస జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. మంత్రి హ‌రీష్‌రావు ఇలాకా కావ‌డంతో తెరాస గెలుపు అక్క‌డ న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న చ‌ర్చ‌సాగుతుంది. పోలింగ్ స‌ర‌ళిని చూస్తేసైతం ఇదే విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని జ‌డ్చ‌ర్ల‌, అచ్చంపేట మున్సిపాలిటీల్లో తెరాస జెండానే ఎగిరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. జ‌డ్చ‌ర్ల‌లో 27 వార్డుల్లో 20కిపైగా వార్డులు తెరాస గెలుచుకుంటుంద‌ని, అచ్చంపేట‌లో 20 వార్డుల‌కు గాను 15 నుంచి 18 వార్డుల‌ను తెరాస అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. న‌కిరేక‌ల్, కొత్తూరు మున్సిపాలిటీల్లో పెరిగిన ఓటింగ్‌శాతం ఎవ‌రికి అనుకూలిస్తుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది. న‌కిరేక‌ల్‌లో తెరాస వ‌ర్సెస్ తెరాస రెబ‌ల్స్ మ‌ధ్య‌నే పోటీ బ‌లంగా జ‌రిగిన‌ట్లు పోలింగ్ అనంత‌రం విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>