PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-vs-etelab78155e9-f19f-478c-b0dd-9457b35b6afe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-vs-etelab78155e9-f19f-478c-b0dd-9457b35b6afe-415x250-IndiaHerald.jpgఅక‌స్మాత్తుగా మంత్రి ఈట‌ల క‌బ్జాకోరు అంటూ వార్త‌లు రావ‌డంతో తెరాస శ్రేణుల్లోనూ ఆందోళ‌న నెల‌కొంది. అయితే ఈ స‌మ‌యంలో ఈట‌ల‌పై వార్త‌లు రావ‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఒకే దెబ్బ‌కు రెండు ఉప‌యోగాలు అన్న‌ట్లుగా ప్లాన్ ప్ర‌కారం ఇదంతా జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ‌సైతం సాగుతుంది. ఈట‌ల‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. బీసీ నాయుకుడిగా గుర్తింపు పొందిన ఈట‌ల.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ వెంటే ఉంటున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈట‌ల పార్టీ స్టాండ్‌కుKCR VS etela;view;kcr;telangana rashtra samithi trs;telangana;backward classes;minister;partyఒకే దెబ్బ‌కు రెండు ఉప‌యోగాలు.. ఈట‌ల‌పై అందుకే ఆరోప‌ణ‌లు!ఒకే దెబ్బ‌కు రెండు ఉప‌యోగాలు.. ఈట‌ల‌పై అందుకే ఆరోప‌ణ‌లు!KCR VS etela;view;kcr;telangana rashtra samithi trs;telangana;backward classes;minister;partySat, 01 May 2021 07:01:00 GMTసీఎం కేసీఆర్ గురిపెట్టాడంటే అవ‌త‌లి వ్య‌క్తి ఎంత‌టివాడైనా బోల్తాప‌డాల్సిందే.. ప‌క్కా వ్యూహంతో కేసీఆర్ త‌న ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తాడ‌న్న పేరుంది. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో అది రుజువైంది కూడా. అయితే తాజాగా మంత్రి ఈట‌ల‌పై కేసీఆర్ గురిపెట్టిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈటల కోట్లు విలువ‌చేసే అసైన్డ్‌మెంట్ భూముల‌ను క‌బ్జాచేశాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తెరాస‌కు అనుకూల మీడియాలో ఒకేసారి ఈట‌ల క‌బ్జాకోరు అంటూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇకేముంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికార పార్టీ సొంత ఛానెల్‌లోనూ ఈట‌ల క‌బ్జాకోరు అంటూ క‌థ‌నాలు  వెలువ‌డ‌టం ప్ర‌తిప‌క్షాల‌కుసైతం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

అక‌స్మాత్తుగా మంత్రి ఈట‌ల క‌బ్జాకోరు అంటూ వార్త‌లు రావ‌డంతో తెరాస శ్రేణుల్లోనూ ఆందోళ‌న నెల‌కొంది. అయితే ఈ స‌మ‌యంలో ఈట‌ల‌పై వార్త‌లు రావ‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఉన్న‌ట్లు  ప్ర‌చారం సాగుతుంది. ఒకే దెబ్బ‌కు రెండు ఉప‌యోగాలు అన్న‌ట్లుగా ప్లాన్ ప్ర‌కారం ఇదంతా జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ‌సైతం సాగుతుంది. ఈట‌ల‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. బీసీ నాయుకుడిగా గుర్తింపు పొందిన ఈట‌ల.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ వెంటే ఉంటున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈట‌ల పార్టీ స్టాండ్‌కు వ్య‌తిరేఖంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తెరాస‌కు ఓన‌ర్లం తామేనంటూ ఆయ‌న గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అప్ప‌టి నుండే ఈట‌ల‌పై కేసీఆర్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈట‌ల  బీసీ మంత్రి కావ‌డంతో త‌న ఆగ్ర‌హాన్ని ఒకేసారి చూపిస్తే తేడాలొస్తాయ‌ని భావించిన కేసీఆర్.. తాజాగా అదును చూసి భూక‌బ్జా ఆరోప‌ణ‌లు తెర‌పైకి తెచ్చిన‌ట్లు ప్ర‌చారంసాగుతుంది.

మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు అధికార తెరాస అనుకూల ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కావ‌టం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌రోనా ప‌రిస్థితులు త‌లెత్తిన  నాటి నుంచి వైర‌స్‌ క‌ట్ట‌డి కోసం మంత్రి ఈట‌ల రాజేంద‌ర్  క్షేత్ర సస్థాయిలో గ‌ట్టిగానే ప‌నిచేస్తున్నార‌నే పేరు వ‌చ్చింది. అయితే క‌రోనా రెండ‌వ ద‌శ నియంత్ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం తీరును హైకోర్టు ఎండ‌గ‌డుతూనే వ‌స్తోంది. ఈ ప‌రిస్థితి నుంచి ప్ర‌జ‌లు, రాజ‌కీయ పార్టీల దృష్టిని మ‌ళ్లించ‌టం కోసమే మంత్రి ఈట‌ల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు తెర‌పైకి తెచ్చారా? అన్న అనుమానాలు ఒక వ‌ర్గం నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి ఛాన్స్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>