PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-a585e0b3-0788-4f5c-a522-338968d091d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-a585e0b3-0788-4f5c-a522-338968d091d8-415x250-IndiaHerald.jpgరాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇక భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబసంక్షేమ శాఖలను తొలగించిన సంగతి తెలిసిందే. KCR;kcr;kumaar;dr rajasekhar;mandula;eatala rajendar;telangana;district;cm;chief minister;survey;minister;governor;anti-corruption bureau;etela rajenderఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్..!ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్..!KCR;kcr;kumaar;dr rajasekhar;mandula;eatala rajendar;telangana;district;cm;chief minister;survey;minister;governor;anti-corruption bureau;etela rajenderSat, 01 May 2021 18:10:00 GMTరాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇక భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబసంక్షేమ శాఖలను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈటల శాఖను తనకు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ను కోరారు. దీంతో మంత్రి ఈటల శాఖను కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ స్వయంగా చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే బాధ్యతలు అందుకుని, కరోనా పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తీవ్రంగా ఉందన్నారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. ఇక ఆసుపత్రిలో రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ విషయంలో గానీ, ఆక్సిజ‌న్, బెడ్ల‌ లభ్యత విషయంలో గానీ, ఇతర ఔషధాల లభ్యత విషయంలో ఏ మాత్రం లోపం రాకూడదని సీఎంకు స్ప‌ష్టం చేశారు.

కరోనా పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అందరు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థంగా పని చేయాలన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అయితే ఈటలపై వచ్చిన భూ అక్రమాల ఆరోపణలకు సంబంధించి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు శనివారం విచారణ ప్రారంభించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ విజిలెన్స్‌ విచారణను పరిశీలించారు. అయితే భూ అక్రమాల్లో అసైన్డ్‌ భూమి కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మే నెలలో 13 లక్షల వ్యాక్సిన్ లు కొంటాం: ఏపీ సర్కార్

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>