PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetala59637eaa-b93a-4eaa-ad19-357b33990527-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetala59637eaa-b93a-4eaa-ad19-357b33990527-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్య‌మంలో సీఎం కేసీఆర్ వెంట ఈట‌ల చురుగ్గా పాల్గొన్నారు. ప్ర‌త్యేక తెల‌గాణ అనంత‌రం కేసీఆర్ క్యాబినెట్లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన‌ట్లు ప్ర‌చారంసాగింది. ఈ క్ర‌మంలో తెరాసకు ఓన‌ర్లు మేమేనంటూ మంత్రి ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో క‌ల‌క‌లం సృష్టించాయి. అప్ప‌టి నుంచి కేసీఆర్ ఈట‌ల‌పై గురిపెట్టిన‌ట్లు పార్టీలో ప్ర‌చారం సాగుతుంది.eetala;kcr;telangana;cm;minister;partyఏం చేద్దాం.. ! పార్టీని వీడుదామా? అనుచ‌రుల‌తో ఈట‌ల స‌మాలోచ‌న‌లుఏం చేద్దాం.. ! పార్టీని వీడుదామా? అనుచ‌రుల‌తో ఈట‌ల స‌మాలోచ‌న‌లుeetala;kcr;telangana;cm;minister;partySat, 01 May 2021 15:51:00 GMTతెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో సీఎం కేసీఆర్ వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. నిన్న‌టికినిన్న ప‌లు ఛాన‌ల్స్‌లో ఆరోగ్య శాఖ మంత్రి భూక‌బ్జా అంటూ వ‌రుస క‌థ‌నాలు రావ‌డంతో వెంట‌నే కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. శ‌నివారం ఉద‌యం విచార‌ణ చేప‌ట్టిన అధికారులు క‌బ్జా నిజ‌మేన‌ని తేల్చారు. అయితే పూర్తిస్థాయి విచార‌ణ నివేదిక‌ను సీఎం కేసీఆర్‌కు అందించ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో ఈట‌ల‌కు షాక్‌నిస్తూ కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈట‌ల వ‌ద్ద ఉన్న శాఖ‌ల‌ను త‌న‌కు బ‌దిలీ చేయాలంటూ కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార‌సును చేశారు. తాజాగా వైద్య ఆరోగ్య‌శాఖ‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ను కేసీఆర్‌కు బ‌దిలీ చేస్తూ గ‌వ‌ర్న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఈటల ఏ శాఖ‌లేని మంత్రిగా ఉండ‌నున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో సీఎం కేసీఆర్ వెంట ఈట‌ల చురుగ్గా పాల్గొన్నారు. ప్ర‌త్యేక తెల‌గాణ అనంత‌రం కేసీఆర్ క్యాబినెట్లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన‌ట్లు ప్ర‌చారంసాగింది. ఈ క్ర‌మంలో తెరాసకు ఓన‌ర్లు మేమేనంటూ మంత్రి ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో క‌ల‌క‌లం సృష్టించాయి. అప్ప‌టి నుంచి కేసీఆర్ ఈట‌ల‌పై గురిపెట్టిన‌ట్లు పార్టీలో ప్ర‌చారం సాగుతుంది. ప్ర‌స్తుతం ఈట‌ల నుంచి శాఖ‌ల‌ను త‌న‌కు బ‌ద‌లాయించుకోవ‌డం ద్వారా ఈట‌ల‌ను కేసీఆర్ ఘోరంగా అవ‌మానించిన‌ట్లు ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ విష‌యంపై ఈట‌ల స్పందించారు. సీఎం కేసీఆర్ త‌న శాఖ‌ల‌ను బ‌ద‌లాయించుకున్న‌ట్లు త‌న‌కు తెలిసింద‌ని, సంతోష‌క‌ర‌మ‌ని, సీఎంకు ఆ అధికారం ఉంటుంద‌ని అన్నారు. అయితే త్వ‌ర‌లోనే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో భేటీఅయ్యి త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని ఈట‌ల తెలిపారు.

తాను ఊహించ‌ని రీతిలో కేసీఆర్ వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టంతో ఈట‌ల త‌న ముఖ్య అనుచ‌రుల‌తో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం పార్టీ వీడుదామా..?  మంత్రి హోదా నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొని ఎమ్మెల్యేగా కొన‌సాగుదామా అన్న విష‌యాల‌పై ఈట‌ల చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అయితే అనుచ‌రులు మాత్రం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీని వీడ‌టం స‌రికాద‌ని, మంత్రి హోదా నుంచి త‌ప్పుకొని ఎమ్మెల్యేగా కొన‌సాగ‌డం బెట‌ర్ అని సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు పార్టీని వీడితే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు స‌మాచారం వెళ్తుంద‌ని, పార్టీలోనే ఉండి క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ‌ను ఎదుర్కొన్నాక పార్టీ మార‌డంపై ఆలోచిస్తే బాగుంటుంద‌ని ఈట‌ల‌కు అనుచ‌రులు సూచించిన‌ట్లు స‌మాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>