Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1d0ebf7c-a273-4f4b-bc31-2c6b35245923-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-1d0ebf7c-a273-4f4b-bc31-2c6b35245923-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తూ అందరిని చిగురుటాకులా వణికిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా శరవేగంగా కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో టీకా ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం లో వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను మరింVaccine;health;kcr;telangana;director;central government;coronavirusతెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?Vaccine;health;kcr;telangana;director;central government;coronavirusSat, 01 May 2021 09:00:00 GMTకరోనా వైరస్ కోరలు చాస్తూ అందరిని చిగురుటాకులా వణికిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో  కేంద్రం అటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా శరవేగంగా కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో టీకా ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.  గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం లో వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.



 అయితే ఇప్పటికీ కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ అందించడంలో విజయం సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇక మొదటి రెండో విడతలో భాగంగా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇక నేటి నుంచి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. అయితే అటు అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ టీకా కొరత మాత్రం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్లు తెలుస్తోంది శర వేగంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే వ్యాక్సిన్ కొరత టీకా ప్రక్రియను అర్ధాంతరంగా ఆగిపోయేలా చేస్తుంది.



 ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీకాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రేపు వాక్సినేషన్  ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలో వాక్సినేషన్ కొరత ఏర్పడిందని ఈ క్రమంలోనే ఇక రెండు రోజుల పాటు టీకా ప్రక్రియను నిలిపి వేసేందుకు నిర్ణయించాము అంటూ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతేకాకుండా టీకా ఉత్పత్తి లభ్యతపై వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాతనే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రంలో ప్రారంభిస్తాము అంటూ చెప్పుకొచ్చారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అయితే ఇలా పలుమార్లు వాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించలేక పోతుంది రాష్ట్రప్రభుత్వం. దీంతో టీకా చేసుకోవాలనుకునే వారు ఎంతోమంది కూడా నిరాశ చెందుతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దంగల్ హీరోయిన్.. ఇండస్ట్రీపై ఎమోషనల్ కామెంట్స్ ?

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>