MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/anr-a0dfeb05-2e58-4cf8-b6e5-c0e24f0560c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/anr-a0dfeb05-2e58-4cf8-b6e5-c0e24f0560c0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కి ఎన్టీయార్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పాలి. వారు తెలుగు సినిమాను చేతులు పట్టుకుని ముందుకు నడిపించారు. కమర్షియల్ నడకలు ఎన్నో నేర్పారు, అలాగె గ్లామర్, గ్రామర్ కూడా అద్దారు. ఈ అగ్ర నటులు సినిమాలు చేస్తే అవి రిలీజ్ కాకుండా ఉండడం అన్నది జరగదు. anr;ntr;suresh;susheela;anand malayalam actor;atreya;chakravarthy;mahadevan;nageshwara rao akkineni;prema;satya;tara;tollywood;cinema;producer;love;producer1;hero;accident;suresh productions;anand deverakondaఇంటరెస్టింగ్ : ఏయన్నార్ సినిమాల్లో ఆ సాంగ్స్ లేవు... ?ఇంటరెస్టింగ్ : ఏయన్నార్ సినిమాల్లో ఆ సాంగ్స్ లేవు... ?anr;ntr;suresh;susheela;anand malayalam actor;atreya;chakravarthy;mahadevan;nageshwara rao akkineni;prema;satya;tara;tollywood;cinema;producer;love;producer1;hero;accident;suresh productions;anand deverakondaSat, 01 May 2021 20:00:00 GMTటాలీవుడ్ కి ఎన్టీయార్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పాలి. వారు తెలుగు సినిమాను చేతులు పట్టుకుని ముందుకు నడిపించారు. కమర్షియల్ నడకలు ఎన్నో నేర్పారు, అలాగె  గ్లామర్, గ్రామర్ కూడా అద్దారు. ఈ అగ్ర నటులు సినిమాలు చేస్తే అవి రిలీజ్ కాకుండా ఉండడం అన్నది జరగదు.

 అలాగే వారి కోసం పాటలు రాస్తే అవి సినిమాల్లో తప్పక ఉండాల్సిందే. అయితే ఏయన్నార్ 80 దశకంలో చేసిన కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన కోసమే రాసిన రికార్డు చేసిన పాటలు మాత్రం తీరా సినిమాల్లో కనిపించవు. చిత్రమేంటంటే ఈ సాంగ్స్ అన్నీ కూడా నాడు రేడియోలో ప్రతీ రోజూ వచ్చేవి. శ్రోతలను విపరీతంగా ఆకట్టుకునేవి. ఈ సాంగ్స్ బంపర్ హిట్ అయి తీరా మూవీ చూస్తే అందులో కనిపించేవి కావు. ఈ సాంగ్స్ ని మరి ఎందుకు చిత్రీకరించలేదో తెలియదు కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురి అయ్యేలాగానే ఇలాంటివి జరిగాయని చెబుతారు. ఈ విధంగా ముందు రికార్డు చేసి సినిమాల్లో కనిపించని పాటల లిస్ట్ చూస్తే అందులో ప్రఖ్యాత నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసిన చిలిపి క్రిష్ణుడు మూవీ  ఒకటి. ఈ మూవీలో యాక్సిడెంట్ భలే యాక్సిడెంట్ అని ఒక సాంగ్ ఉంటుంది.

దీన్ని ఆచార్య ఆత్రేయ రాయగా, ఎస్పీబీ, సుశీల పాడారు. కెవీ మహదేవన్ మ్యూజిక్ చేశారు. ఈ పాట రికార్డ్స్ బయటకు వచ్చి రేడియోల్లో కూడా మారుమోగింది. పాట హిట్. కానీ మూవీలో మాత్రం ఈ సాంగ్ ఉండదు. అలాగే ఆల్ టైమ్ హిట్ అయిన ప్రేమాభిషేకం లో జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో అన్న సాంగ్ ఉంది. క్యాసెట్లలో ఈ సాంగ్ వచ్చి ఒక మోత మోగించింది. తీరా మూవీలో మాత్రం ఈ సాంగ్ ఎక్కడా కనిపించరు. దాసరి రాసిన ఈ సాంగ్ ని బాలూ పాడగా చక్రవర్తి మ్యూజిక్ చేశారు.

అదే విధంగా బంగారు కానుక అని ఏయన్నార్ మూవీ అప్పట్లో  వచ్చింది. అందులో ప్రేమ బృందావనం అన్న సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఈ సాంగ్ ని జి ఆనంద్, సుశీల పాడారు, దీనికి మ్యూజిక్ సత్యం అందిస్తే వేటూరి ఈ పాటను రాశారు. క్యాసెట్లలో ఈ సాంగ్ ఉంది. అప్పట్లో రేడియోలో నంబర్ వన్ సాంగ్ గా మోత మోగింది. తీరా సినిమాలో చూస్తే మాత్రం ఈ సాంగ్ ఉండదు. ఇదే విధంగా మరికొన్ని సినిమాలలో  కూడా ఇలాగే  జరిగాయి. మొత్తానికి ఎందుకో కానీ సాంగ్స్  విని  తమ హీరో విజువల్స్ ని ఊహించుకున్న వారికి మాత్రం తీరా  సినిమాలో  ఆ సాంగ్స్ లేకపోగా పూర్తి నిరాశ కలిగింది అని కలుగుతుంది అని చెప్పాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>