PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/trs4c2da617-ee03-4036-8000-f661537c56c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/trs4c2da617-ee03-4036-8000-f661537c56c2-415x250-IndiaHerald.jpgరెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు ముందుకెళుతుంది. అయితే మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త ఛాన్స్ దక్కుతున్నా, దక్షిణాదిలో పెద్దగా అవకాశం రావడం లేదు. ఏదో కర్ణాటకలో అధికారం చేజిక్కించుకున్న కమలదళం ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది.trs;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;warangal;telangana;narendra modi;congress;huzur nagar;nalgonda;survey;ranga reddy;central government;adilabad;karimnagar;partyఅక్కడ బీజేపీకి అంత సీన్ లేదా? గులాబీ పార్టీకి కలిసొచ్చినట్లేనా?అక్కడ బీజేపీకి అంత సీన్ లేదా? గులాబీ పార్టీకి కలిసొచ్చినట్లేనా?trs;kcr;nagarjuna akkineni;hyderabad;bharatiya janata party;warangal;telangana;narendra modi;congress;huzur nagar;nalgonda;survey;ranga reddy;central government;adilabad;karimnagar;partySat, 01 May 2021 02:00:00 GMTరెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు ముందుకెళుతుంది. అయితే మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త ఛాన్స్ దక్కుతున్నా, దక్షిణాదిలో పెద్దగా అవకాశం రావడం లేదు. ఏదో కర్ణాటకలో అధికారం చేజిక్కించుకున్న కమలదళం ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది.


ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టి నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటుంది. అయితే కేసీఆర్...కాంగ్రెస్, టీడీపీలని వీక్ చేయడంతోనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చేసింది. ఇటీవల దుబ్బాక ఉపఎన్నిక కావొచ్చు, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కావొచ్చు టీఆర్‌ఎస్‌కు షాక్ కొట్టేలా బీజేపీ సత్తా చాటింది. అయితే బీజేపీకి రాష్ట్రంలో ఎంత బలం ఉందంటే చెప్పడం కష్టమే.


ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కాషాయ పార్టీకి పెద్ద సీన్ లేదు. ఏదో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలో కాషాయ పార్టీ బలంగా ఉంది గానీ, మిగిలిన జిల్లాలో పెద్ద సీన్ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మిగిలిన జిల్లాలో కాంగ్రెస్‌కు కాస్త బలం ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉంది. ఆ విషయం నాగార్జునసాగర్ ఉప ఎన్నికతోనే అర్ధమైందని చెప్పొచ్చు. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది.


అలాగే ఆ తర్వాత కాంగ్రెస్‌కు బాగానే ఓట్లు పడతాయని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు 50 శాతంపైనే ఓట్లు వరకు రానున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌కు 40 శాతం వరకు ఓట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీజీపీకి 6 నుంచి 7 శాతం వరకే ఓట్లు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ అంశం ఓ రకంగా గులాబీ పార్టీకి కలిసొచ్చినట్లే. అలాగే కమలం పార్టీకి అన్నీ జిల్లాలోనూ పట్టు లేదని తెలుస్తోంది. 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>