MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-nelaku-kevalam-ru-250-kadhite-chalu-prathi-nela-ru-5-veallu-pondhavachu0958e948-ae82-449e-ba10-493252871f85-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-nelaku-kevalam-ru-250-kadhite-chalu-prathi-nela-ru-5-veallu-pondhavachu0958e948-ae82-449e-ba10-493252871f85-415x250-IndiaHerald.jpg ముఖ్యంగా మనదేశంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లతో సహా కేంద్రం కూడా ఎప్పటికప్పుడు , ప్రజలకు అనుకూలంగా ఉండే కొన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న మొత్తంతో ఆదా చేసి, ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించే స్కీమ్ లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో రకాల స్కీం లలో ,ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త స్కీం అందరికీ ప్రయోజన కరంగా మారింది.. అయితే ఆ స్కీమATTAL PM AYOJAN PADAHAKAM,GOVERMENT;adah sharma;jeevitha rajaseskhar;rbi;central government;manadesamమనీ: నెలకు కేవలం రూ.250 కడితే చాలు.. ప్రతి నెల రూ.5 వేలు పొందవచ్చు..మనీ: నెలకు కేవలం రూ.250 కడితే చాలు.. ప్రతి నెల రూ.5 వేలు పొందవచ్చు..ATTAL PM AYOJAN PADAHAKAM,GOVERMENT;adah sharma;jeevitha rajaseskhar;rbi;central government;manadesamSat, 01 May 2021 11:00:00 GMT
ముఖ్యంగా మనదేశంలో  ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లతో సహా కేంద్రం కూడా ఎప్పటికప్పుడు , ప్రజలకు అనుకూలంగా ఉండే కొన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న మొత్తంతో ఆదా చేసి, ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించే స్కీమ్ లే  ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో రకాల స్కీం లలో ,ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త స్కీం అందరికీ ప్రయోజన కరంగా మారింది.. అయితే ఆ స్కీమ్ ఏమిటి? దాని వివరాలు ఏమిటి ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి..


కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన స్కీం లలో "అటల్ పెన్షన్ యోజనా పథకం" కూడా ఒకటి. ఇక ఈ స్కీం లో చేరడం వల్ల ప్రతి నెల కొంత డబ్బును పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇక ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపాలని ఆశిస్తున్నారో, అలాంటి వారికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పవచ్చు.. అటల్ పెన్షన్ యోజనా పథకం లో చేరితే ప్రతినెల వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ రూపం లో పొందడానికి వీలు ఉంటుంది.


అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా  నెల నెలా కొంత డబ్బు ను చెల్లించాలి. అంటే  మీ వయసు, మీరు చెల్లించే డబ్బులు ప్రాతిపదిక మీద  మీకు వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.  ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఉన్న వారు నెలకు రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే, నెలకు రూ.248 కట్టాలి . ఉన్న ప్రతి నెల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు కట్టడంవల్ల 60 సంవత్సరాలు వచ్చేసరికి మీకు ప్రతినెలా ఐదు వేల రూపాయల పెన్షన్ రూపంలో వస్తాయి. మీరు ఎంత త్వరగా ఈ పథకంలో చేరితే అంత మేలు.


ఇక త్వరగా ఈ పథకంలో చేరడం వల్ల  తక్కువ మొత్తంతోనే అధిక పెన్షన్ ను పొందొచ్చు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే, నామినీ లేదా వారి భాగస్వామికి పెన్షన్ డబ్బులు చెల్లిస్తారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA ) ఈ స్కీమ్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పథకంలో చేరండి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>