MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/copronavirusac61e0bc-3acf-4f6c-a5e9-926b5aa8120f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/copronavirusac61e0bc-3acf-4f6c-a5e9-926b5aa8120f-415x250-IndiaHerald.jpgరామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది పవర్ ఫుల్ డైరెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు ఈ పేరు వినిపిస్తే అందరూ అనే మాట వివాదాల విక్రమార్కుడు. మరి నేడు కనిపిస్తున్న వర్మ సామాజిక స్పృహ తో వెలిగిపోతూ ప్రజల కోసం లీడర్ గా మారారా అంటే ? తాజాగా సోషల్ మీడియా వేదిక పై ఆయన చేస్తున్న పోస్ట్ లు నిజమే అంటున్నాయి. అంతే కాదు నిరంతరం ఆయన చేసే పోస్ట్ లపై విమర్శలు విసిరే ఎక్కువ మంది నెటిజన్లు, నేడు ఆయన వ్యవహార శైలికి జేజేలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు. COPRONAVIRUS;amit shah;ram gopal varma;ram pothineni;varsha;vedhika;narendra modi;ram madhav;police;media;collector;marriage;prime minister;twitter;director;arrest;central government;research and analysis wing;leader;coronavirusమోదీ పై చెలరేగిన ఆర్జీవికి పెరుగుతున్న జనాదరణ !మోదీ పై చెలరేగిన ఆర్జీవికి పెరుగుతున్న జనాదరణ !COPRONAVIRUS;amit shah;ram gopal varma;ram pothineni;varsha;vedhika;narendra modi;ram madhav;police;media;collector;marriage;prime minister;twitter;director;arrest;central government;research and analysis wing;leader;coronavirusSat, 01 May 2021 13:00:00 GMT" style="height: 681px;">
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది పవర్ ఫుల్ డైరెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు ఈ పేరు వినిపిస్తే అందరూ అనే మాట వివాదాల విక్రమార్కుడు.  మరి నేడు కనిపిస్తున్న వర్మ సామాజిక స్పృహ తో వెలిగిపోతూ ప్రజల కోసం లీడర్ గా మారారా అంటే ? తాజాగా  సోషల్ మీడియా వేదిక పై ఆయన చేస్తున్న పోస్ట్ లు నిజమే అంటున్నాయి. అంతే కాదు నిరంతరం ఆయన చేసే పోస్ట్ లపై విమర్శలు విసిరే ఎక్కువ మంది నెటిజన్లు, నేడు ఆయన వ్యవహార శైలికి జేజేలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ అంతగా ప్రజలను ఆకట్టుకున్న వర్మ చేసిన పోస్ట్ ఏమిటంటే. కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలే త్రిపురలో పెళ్లి చేసుకున్న ఒక జంటను గురించి  సమాచారం అందుకున్న కలెక్టర్, పోలీసులతో అక్కడకు వెళ్లి  వారి పెళ్లి వేడుకను అడ్డుకొని కొట్టి అరెస్ట్ చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వివాహాలకు హాజరవుతున్న ప్రజలను సైతం పోలీసులు అధికారులు అమానుషంగా కొడుతున్నారని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని, ఆర్జీవీ ఆరోపించారు.
 
ఇలా చేస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుందనే ఉద్దేశంతో.. సాధారణ ప్రజలను తరిమి తరిమి కొడుతున్నారు ...ఒకవిధంగా సమంజసమే అనుకుందాం.  మరి అదే న్యాయం అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా వర్తించాలి కదా.  వారు కూడా కరోనా నిబంధనలను ఉల్లంఘించినప్పుడు  ప్రజలు కూడా వారిని అలాగే  ట్రీట్ చేయాలి  కదా అన్న ఉద్దేశంతో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.  కరోనా గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్న అధికారులు కుంభమేళా సమయంలో సామూహికంగా వందలమంది సాధువులను అనుమతించేటప్పుడు... వారి జాగ్రత్త ఎక్కడికి పోయింది..?? అప్పుడు కరోనా వ్యాప్తి చెందదా..?? ఇలా సమాజం పట్ల తమ బాధ్యత విస్మరించినందుకు పోలీసులను, ప్రభుత్వ అధికారులను ప్రజలు కొడితే ఫర్వాలేదా అని వర్మ ముక్కుసూటిగా ప్రశ్నించారు. దీనికి ఏమి సమాధానం చెప్తారు అంటూ విమర్శించారు. కరోనా వైరస్ ప్రభావం.. దేశంలో ఉన్నప్పటికీ... ఆ విషయాన్ని విస్మరించి ఓవైపు ఎన్నికలు మరోవైపు కుంభమేళాకు కేంద్రం అనుమతి ఇవ్వడం వలనే కరోనా సెకండ్ వేవ్ విలయం మొదలైంది అన్న విమర్శలు ఉన్నాయి.


మరి ఇంతటి ముప్పుకు ప్రధాన కారణమైన కుంభమేళాకు అనుమతులు ఇచ్చిన ప్రధానమంత్రి మరియు అధికారులు కుంభమేళాలో సామూహికంగా వందలమంది సాధువులను అనుమతించినందుకు  ప్రభుత్వ అధికారులను,పోలీసులను  ప్రజలు ఎం చేయాలి అంటూ  కడిగిపారేశాడు.  ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఈ ముప్పుకు కుంభమేళా పేరుతో అనుమతి ఇవ్వడమే కాకుండా వారే స్వయంగా భారీ ర్యాలీలో పాల్గొని భాగమైనందుకు ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను ప్రజలు ఏం చేయాలి అంటూ ? ఏ రకంగా చూడాలి అంటూ..?? కుండ బద్దలు కొట్టినట్టు నిలదీశారు. అంతేకాదు ఈ క్రమంలో మోడీని, అమిత్ షాను  వర్మ ట్యాగ్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉన్నట్టుండి రాంగోపాల్ వర్మ లో ఇంతటి పెనుమార్పు చూసిన నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయినా... తర్వాత ఆయన ప్రజల కోసం అధికారులనే ప్రశ్నించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే మరికొందరు మీరు మారిపోయారు సార్..??? మారిపోయారండి. కానీ ఇక మారకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>