MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith-9c8062c0-7029-461b-ab74-3fbbcff4530e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajith-9c8062c0-7029-461b-ab74-3fbbcff4530e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన 1971 మే 1న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించారు. అజిత్ తల్లి కొలకత్తా చెందిన ఆమె కాగా.. ఆయన తండ్రి కేరళకు చెందిన వ్యక్తి. ఇక అజిత్ పదవ తరగతిలోనే చదువు మానేశాడు. Ajith;ajith kumar;jeevitha rajaseskhar;prema;sriram;varsha;cinema;murugadoss;tamil;marriage;kannada;love;hero;a r murugadoss;april;father;ajit pawarతమిళ్ స్టార్ అజిత్ కు 'తలా' అనే పేరు ఎలా వచ్చిదంటే ..?తమిళ్ స్టార్ అజిత్ కు 'తలా' అనే పేరు ఎలా వచ్చిదంటే ..?Ajith;ajith kumar;jeevitha rajaseskhar;prema;sriram;varsha;cinema;murugadoss;tamil;marriage;kannada;love;hero;a r murugadoss;april;father;ajit pawarSat, 01 May 2021 13:00:00 GMTహీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన 1971 మే 1న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించారు. అజిత్ తల్లి కొలకత్తా చెందిన ఆమె కాగా.. ఆయన తండ్రి కేరళకు చెందిన వ్యక్తి. ఇక అజిత్ పదవ తరగతిలోనే చదువు మానేశాడు. అతడి స్నేహితుడి ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో అప్రెంటీస్‌ మెకానిక్‌గా పని చేశారు.

ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలోకి దిగిన అజిత్‌ అక్కడే ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. ఆ తర్వాత మోడలింగ్‌ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ అజిత్‌లోని నటుడిని గుర్తించారు. అజిత్ మొదటి సారిగా ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ప్రేమ పుస్తకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యాడు. సినీ జీవితం మొదలు పెట్టిన తొలిరోజుల్లో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించారు.

ఇక అమర్కలం చిత్ర షూటింగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ షాలినీతో ప్రేమలో పడ్డారు. 2000 ఏప్రిల్‌ 24న పెళ్లిబంధంతో వీరిద్దరూ ఒకటైయ్యారు. పెళ్లి తరువాత షాలినీ సినిమాలో నటించలేదు. ఇక ఇండస్ట్రీలో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న అజిత్‌ను  మాస్‌ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన చిత్రం ‘ధీన’. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అజిత్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో అజిత్‌ పోషించిన పాత్ర 'తలా'నే అభిమానులు పిలుచుకునే ముద్దుపేరైంది. ఇక ఆసాయ్’ అనే సినిమా సక్సెస్‌ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అజిత్ నటించిన ఆరు సినిమాలు ఒక్క సంవత్సరంలో విడుదల కావడం ఒక్క విషయం అయితే.. ఆరు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే అజిత్‌..వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ను విచ్చేస్తుంటారు.  ప్రస్తుతం హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో అజిత్‌ నటిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>