MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-and-super-star-in-one-moviebf4dbb34-efa3-4113-aa7a-1e5d2d056b4c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-and-super-star-in-one-moviebf4dbb34-efa3-4113-aa7a-1e5d2d056b4c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి అయ్యప్పనుం కోషియం మూవీ తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు. కాగా వీటిలో అయ్యప్పనుం కోషం మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు హరిహర వీరమల్లు షూటింగ్ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఏ ఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పmaheshbabu-pawankalyan;pawan;mahesh;nidhhi agerwal;hari;hari music;kalyan;kranthi;kranti;nidhi;parasuram;pawan kalyan;ram pothineni;surya sivakumar;makar sakranti;hyderabad;india;cinema;rajani kanth;sankranthi;media;september;remake;thief;donga;manadesam;mega surya productionsపవనే కాదట .... మహేష్ కూడా అదే టైం కి ఫిక్స్ అట ... ??పవనే కాదట .... మహేష్ కూడా అదే టైం కి ఫిక్స్ అట ... ??maheshbabu-pawankalyan;pawan;mahesh;nidhhi agerwal;hari;hari music;kalyan;kranthi;kranti;nidhi;parasuram;pawan kalyan;ram pothineni;surya sivakumar;makar sakranti;hyderabad;india;cinema;rajani kanth;sankranthi;media;september;remake;thief;donga;manadesam;mega surya productionsSat, 01 May 2021 19:30:00 GMTప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి అయ్యప్పనుం కోషియం మూవీ తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు. కాగా వీటిలో అయ్యప్పనుం కోషం మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు హరిహర వీరమల్లు షూటింగ్ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఏ ఎం రత్నం, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే కొద్ది రోజులుగా మనదేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉండటంతో అన్ని షూటింగ్స్ బంద్ చేయబడ్డాయి.

దానితో హరి హర వీరమల్లు షూటింగ్ కూడా అయిపోయింది. అలానే పలు సినిమాల విడుదలలు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. దానితో హరిహర వీరమల్లు కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని ఆ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉందని రెండు రోజుల నుంచి ఒక వార్త మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, అదంతా ఒట్టి అబద్ధం అని పక్కాగా తాము ముందే అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఆ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభం అయింది, అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా దానిని హఠాత్తుగా నిలుపుదల చేశారు. నిజానికి ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని ఇటీవల యూనిట్ ప్రకటించింది.

అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఆగిపోవడంతో ఆ ప్రభావం సినిమా రిలీజ్ పై కూడా పడనుందని అలాగే సర్కారు వారి పాట కూడా వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్లనుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దీనిని కూడా ఖండిస్తూ ఆ మూవీ నిర్మాతలు ముందుగా అనుకున్న ప్రకారమే తమ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. మొత్తంగా అటు పవర్ స్టార్, ఇటు సూపర్ స్టార్ ఇద్దరూ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పక్కాగా నిలుస్తారని తెలుస్తోంది......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>