Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gasd9bf7d7a-c55c-47e8-a9a7-12775d3f37a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gasd9bf7d7a-c55c-47e8-a9a7-12775d3f37a7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా కల్లోలమే కనిపిస్తోంది. ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. వ్యాక్సినేషన్ మాత్రమే కరోనాకు కల్లెం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరో వైపు సామాన్యులకు ధరల భారం మరింత పెరిగిపోయింది. ఉద్యోగాలు కోల్పోయి కొందరు, ఆర్థిక భారాలతో మరికొందరు విలవిల్లాడుతున్నారు. నిత్యావసరాల వస్తువులలో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందGas;hyderabad;capital;oil;central government;coronavirusగ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.!గ్యాస్ సిలిండర్ వాడే వారికి శుభవార్త.!Gas;hyderabad;capital;oil;central government;coronavirusSat, 01 May 2021 13:00:00 GMT

 ప్రస్తుతం హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 861గా ఉంది. అయితే ప్రతీ నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా అలాగే స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.



కరోనా వైరస్ నేపథ్యంలో ఎల్‌పీజీ కస్టమర్లకు ఇది ఊటర కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఇకపోతే గత నెలలో సిలిండర్ ధర రూ.10 తగ్గిన విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.809గా ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.835 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర 809 వద్ద ఉంది. చెన్నైలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. రూ.825 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 వద్ద కొనసాగుతోంది.



ఇదిలా ఉంటే సిలిండర్ ధరకు మరో రూ.20 లేదా రూ.30 చెల్లించుకోవాల్సిన పరిస్థితి చాలా చోట్ల నెలకొని ఉంది. డెలివరీ బాయ్స్ ఒక్కోచోట ఒక్కోలా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు గ్యాస్ ధర మరింత భారం కాకుండా ఈసారి సాధ్యమైనంత వరకూ తగ్గించాలనే కేంద్రం చూస్తోంది. అందులో భాగంగా ఈసారి రేట్లను పెంచకుండా స్థిరంగానే ఉంచింది. ఇది కరోనా కష్టకాలంలో ప్రజలకు ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>