PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus3ffbb72d-0204-44ed-b02a-0a2f0a1d279e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus3ffbb72d-0204-44ed-b02a-0a2f0a1d279e-415x250-IndiaHerald.jpgకనికరం లేని కరోనా ప్రపంచ ప్రజలను కబలించేస్తోంది. మన దేశంలోనూ వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుని దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లక్షలు దాటుతున్న కేసులే ఈ మహమ్మారి ఉదృతి కి నిదర్శనం. వేల మరణాలు ఈ కాలాంతక కనికరం లేని వైరస్ కోరల విషానికి సాక్ష్యం. ఇలా దేశమంతటా ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తోంది.CORONAVIRUS;bhama;kaala;shatru1;shaktiయువతా మేలుకో ... మీ నిర్లక్ష్యంతో కుటుంబాన్ని బలి చేయకండి ?యువతా మేలుకో ... మీ నిర్లక్ష్యంతో కుటుంబాన్ని బలి చేయకండి ?CORONAVIRUS;bhama;kaala;shatru1;shaktiSat, 01 May 2021 11:00:00 GMTకనికరం లేని కరోనా ప్రపంచ ప్రజలను కబలించేస్తోంది. మన దేశంలోనూ వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుని దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లక్షలు దాటుతున్న కేసులే ఈ మహమ్మారి ఉదృతి కి నిదర్శనం. వేల మరణాలు ఈ కాలాంతక కనికరం లేని వైరస్ కోరల విషానికి సాక్ష్యం.  ఇలా దేశమంతటా ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ...భారీ స్థాయిలో జరగకపోవడంతో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకీ వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. మనం చేసే ఒక చిన్న పొరపాటు మన జీవితాలనే శాసిస్తోంది. యువత పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోయినప్పటికీ వయసు మీద పడిన వాళ్ళు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైరస్ కాటుకు ఎక్కువగా బలవుతున్నారు. 

అలాంటి వారు ఎంతో మంది రోగనిరోధక శక్తి పటిష్టంగా లేకపోవడం చేత తమ ప్రాణాలను సైతం కొల్పోతున్నారు.  అయితే  ఈ నిర్లక్ష్యం ఎవరిది ఎలా దీన్ని అడ్డుకోవాలని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రయాణాలు చేయకూడదు, ప్రజలు ఒకచోట గుమికూడడం విరుద్ధం, పార్టీలకు, హోటల్స్ కు, పార్కులకు....ఇలా జనం ఎక్కువగా సంచరించే ప్రదేశాలకు వెళ్ళకూడదు. చేతులను నిరంతరం వీలు అయిననన్ని సార్లు కడుక్కోవాలి. చేతికి శానిటైజర్, ముఖానికి మాస్క్ తప్పనిసరి అని ఓ వైపు ప్రభుత్వాలు మరో వైపు ఆరోగ్యనిపుణులు తలబాధుకొని చెబుతున్నారు. అయినా చాలా మంది ఈ సూచనలను, హెచ్చరికలను పక్కనపెట్టి వారి నిర్లక్ష్య ధోరణితో ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. వారు ప్రమాదంలో పడటమే కాదు వారి కుటుంబాన్ని కూడా ప్రమాదంలో కి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత...ఎంతోమంది యువకులు మేము వయసులో ఉన్నాం కోవిడ్  మమ్మల్ని ఏమి చేయలేదు అనుకొని వారి ఇష్టానుసారం తిరగేస్తున్నారు.

ఓ వైపు వారి కుటుంబసభ్యులు చెబుతున్నా ఇంట్లో ఉంటే బోర్ కొడుతోంది అంటూ వారి మాటలు ఖాతరు చేయకుండా బయటకు వెళ్లిపోతున్నారు. అది ఎటువంటి కోవిడ్ సూచనలు పాటించకుండా..ఇలా తిరిగి వైరస్ ను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకొస్తున్నారు. తద్వారా కరోనా పాజిటివ్ రావడం, ఇంట్లో ప్రశాంతంగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు అంటించడం చేస్తున్నారు. కొంతమంది యువత ఈ కరోనా కారణంగా ఆరోగ్యంగా  బయటపడగలుగుతున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి పరిణామాలు పెద్ద సంఖ్య లో చోటుచేసుకుంటున్నాయి. మనకేమి కాదులే అని యువత బయట బలాదూర్లు తిరిగి తీసుకొచ్చిన వైరస్ ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు(తల్లితండ్రులు, భామ, తాతలు,..) సోకుతుంది. అలా సోకిన వైరస్ వారి ప్రాణాలను బలితీసుకుంటుంది.

ఇలాంటి సందర్భాలు భారీగానే జరుగుతున్నాయి. తమ పిల్లలే తమ పాలిట శత్రువులుగా మారుతున్నారు. ఎంతోమంది వారి ద్వారా వచ్చిన వైరస్ తమ కుటుంబసభ్యులకు సోకి తల్లితండ్రులను కోల్పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ విషయం గురించి ఆలోచించండి. మనం చేసే ఒక చిన్న పొరపాటు మన కుటుంబానికి శాపం కాకూడదు. మన నిర్లక్ష్యానికి కుటుంబ సభ్యులు బలికావడం ఎంతవరకు సమంజసం. యువత ఇప్పటికైనా మేల్కొని కరోనా నిభందనలు పెడచెవిన పెట్టకుండా మీ కుటుంబాన్ని వైరస్ భారీనుండి సంరక్షించుకోండి. మీ నిర్లక్ష్యం మీకు ప్రమాదం కాకపోవచ్చు...కానీ మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం పొంచి ఉందని గుర్తించండి. క్షేమంగా ఉండండి...మీ కుటుంబాన్ని ఈ సమాజాన్ని క్షేమంగా ఉంచండి. "స్టే హోం... స్టే సేఫ్"



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>