PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-uma927fefbe-dd17-456a-9855-e8c0591d1f06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-uma927fefbe-dd17-456a-9855-e8c0591d1f06-415x250-IndiaHerald.jpgటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా...రాజకీయాలు ఎప్పుడు అతిగానే ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయన ఏం మాట్లాడినా పెద్దగా నమ్మలేనట్లుగానే ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులపై ఎలాంటి విమర్శలు చేసినా, వాటిల్లో నిజం ఉన్నట్లు అనిపించదు. నాలుగుసార్లు వరుసగా గెలిచి, జగన్ వేవ్‌లో తొలిసారి ఓటమి పాలైన దగ్గర నుంచి ఉమా రాజకీయం ఇలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఉమా మాటలు సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరనే చెప్పొచ్చు.devineni uma;cbn;nani;kodali nani;tara;krishna river;jagan;devineni avinash;media;chief minister;minister;tdp;devineni uma maheswara rao;partyఉమా సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయారా? బాబుని బుక్ చేసినట్లేనా?ఉమా సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయారా? బాబుని బుక్ చేసినట్లేనా?devineni uma;cbn;nani;kodali nani;tara;krishna river;jagan;devineni avinash;media;chief minister;minister;tdp;devineni uma maheswara rao;partySat, 01 May 2021 01:00:00 GMTటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా...రాజకీయాలు ఎప్పుడు అతిగానే ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయన ఏం మాట్లాడినా పెద్దగా నమ్మలేనట్లుగానే ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులపై ఎలాంటి విమర్శలు చేసినా, వాటిల్లో నిజం ఉన్నట్లు అనిపించదు. నాలుగుసార్లు వరుసగా గెలిచి, జగన్ వేవ్‌లో తొలిసారి ఓటమి పాలైన దగ్గర నుంచి ఉమా రాజకీయం ఇలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఉమా మాటలు సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరనే చెప్పొచ్చు.


ఎందుకంటే ఉమా తాను ఎదగడానికి చూస్తు, పక్క నాయకులని తోక్కేయాలని చూస్తుంటారు. ఆ విషయం కృష్ణా జిల్లాలోని కొందరు టీడీపీ నేతలని అడిగితే చెప్పేస్తారు. ముఖ్యంగా ఉమా వల్ల టీడీపీని వదిలిన కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే బాగా చెబుతారు. అందుకే ఉమా వల్ల పార్టీకి లాభం ఎంత వస్తుందో తెలియదు గానీ, నష్టమైతే బాగానే ఉంటుందని తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.


అయితే ఇప్పటికీ ఉమా పార్టీకి డ్యామేజ్ చేసేలాగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వీడియో మార్ఫింగ్ చేశారని కేసు పెట్టిన సి‌ఐడి్ అధికారులు ఉమాని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ అంశంలో ఉమా మీడియా ముందు ఊహించని వ్యాఖ్యలు చేశారు.


జగన్‌పై మార్ఫింగ్‌ వీడియో చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబేనని చెబితే, వదిలేస్తామని సీఐడీ అధికారులు తనపై వత్తిడి తెచ్చారంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఉమా ఇలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కావాలనే సానుభూతి పొందాలనే విధంగా ఉమా రాజకీయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఏదో సినిమాల్లో మాదిరిగా ఉమా, బాబు పేరు చెబితే వదిలేస్తామని సి‌ఐ‌డి అధికారులు బెదిరించారని మాట్లాడినట్లు అర్ధమవుతుంది. ఇక ఇలాంటి మాటల వల్ల రాజకీయంగా లబ్ది పొందడం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా కనిపిస్తోంది. ఏదేమైనా ఉమా తన పనికిమాలిన రాజకీయంతో బాబుని మళ్ళీ బుక్ చేసేలా ఉన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ బీజేపీకి అంత సీన్ లేదా? గులాబీ పార్టీకి కలిసొచ్చినట్లేనా?

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>