PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus1a7e973f-b070-4298-829e-8a518f51f11f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus1a7e973f-b070-4298-829e-8a518f51f11f-415x250-IndiaHerald.jpgఅంచనాలు అన్నీ తప్పేస్తున్నాయి. ఒకటి అనుకుంటే మరోటి జరుగుతోంది. ఎవరికీ కరోనా గురించి తెలియని వేళలోనే చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామనిపిస్తోంది. ఇపుడు చూస్తే అన్నీ తెలిసిపోయాయి అన్న నిర్లక్ష్యమో లేక ఉదాశీనతో తెలియదు కానీ అతి పెద్ద ముప్పు ముంగిట ఉన్నా ఏం చేయని సీన్ ఉంది. caronavirus;central governmentముప్పు మరింత ముందుకు.... ?ముప్పు మరింత ముందుకు.... ?caronavirus;central governmentSat, 01 May 2021 10:03:09 GMTఅంచనాలు అన్నీ తప్పేస్తున్నాయి. ఒకటి అనుకుంటే మరోటి జరుగుతోంది. ఎవరికీ కరోనా గురించి తెలియని వేళలోనే చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామనిపిస్తోంది. ఇపుడు చూస్తే అన్నీ తెలిసిపోయాయి అన్న నిర్లక్ష్యమో లేక ఉదాశీనతో తెలియదు కానీ అతి పెద్ద ముప్పు ముంగిట ఉన్నా ఏం చేయని సీన్ ఉంది.

ఇదిలా ఉంటే కరోనా రెండవ దశ ఉధృతి విషయంలో రకరకాలైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చాలా మంది చాలా రకాలుగా అంచనాలు వేశారు. అయితే అవి తప్పు అయి చెప్పి మరీ  కరోనా విశ్వరూపమే చూపిస్తోంది కూడా. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా రెండవ దశ మే నెల 14 నుంచి తారస్థాయికి చేరుకుంటుంది అని ఒక అంచనా ఉంది. అయితే దాని విషయంలో ఇపుడు తాజాగా మరో సమాచారం వెలుగు చూస్తోంది

అదేంటి అంటే కరోనా కేసులు ఈ నెల  3 నుంచి 5 తేదీల  మధ్య తారస్థాయికి చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందిస్తున్న శాస్త్రవేత్తల బృందమొకటి తెలిపినట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. సెకండ్ వేవ్ లో  వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉందని అందువల్లనే గతంలో అంచనా వేసిన దానికంటే ముందే కేసులు తారస్థాయికి చేరే అవకాశం ఉందని ఈ బృందం వెల్లడించినట్లుగా చెబుతున్నారు.

అదే కనుక నిజం అయితే మాత్రం ముప్పు మరింత దగ్గరగా వచ్చేసింది అనుకోవాలి. ఈ సమయంలో ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు. తమ వ్యాపకాలను మరింతగా తగ్గించుకోవాలి. అంతే కాదు, బయటకు వెళ్లే సమయాన్ని వీలున్నంతవరకూ బాగా కుదించుకోవాలి. ఇంకా వీలు అయితే అసలు వీధి ముఖం చూడకుండానే ఉంటే బెటర్ అని వైద్య పరిశోధకులు అంటున్నారు.

కరోనా రెండవ దశ గొలుసు చాలా బలంగా ఉందని, దాన్ని తెంచాలి అంటే జనాలు ఎవరికి వారు స్వీయ లాక్ డౌన్ పాటించడం ఒక్కటే ఇపుడున్న పరిస్థితుల్లో మార్గమని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే మే నెలలో అడుగుపెడుతూనే పిడుగు లాంటి వార్తలు వస్తున్నాయి. కరోనా విస్తృత వ్యాప్తి ఇంకా జోరు అందుకుంటుందని, అది రేపో మాపో అన్నట్లుగా అంచనాలు వెల్లడి కావడంతో ఎవరికి వారే నియంత్రణలో ఉండాలి. అదే శీరామ రక్ష అని అంతా చెబుతున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>