PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpgదీంతో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. ఇక‌, పార్టీలు మార‌డం.. త‌న కంటూ.. కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకోక పోవ‌డం వంటివి కూడా పాలేటి ప్ర‌తిబంధ‌కంగానే మారాయ‌ని.. చెబు తున్నారు. ప్ర‌స్తుతం.. ఆయ‌న వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న‌సు మాత్రం బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతోంద‌ని చెబుతున్నారు. అంటే.. వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌కు గుర్తింపు లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని.. క‌నీసం పార్టీలోనూ గుర్తింపు ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా చ‌రysrcp;view;rbi;media;mla;minister;letter;chirala;ycp;allu sneha;partyఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?ysrcp;view;rbi;media;mla;minister;letter;chirala;ycp;allu sneha;partySat, 01 May 2021 11:09:00 GMTమాజీ మంత్రి, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న చీరాల నాయ‌కుడు పాలేటి రామారావును ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదా? ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా, సామాజిక వ‌ర్గం ప‌రంగా.. పాలేటికి గ‌తంలో గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న స్థిర‌మైన రాజ‌కీయాలు చేయ డం లేద‌నే వాద‌న మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తం నుంచి ఆయ‌న ప్ర‌స్తుత చీరాల ఎమ్మెల్యే.. ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ క‌ర‌ణం బ‌ల‌రాంతో ఉన్న స్నేహం కార‌ణంగా.. ఆయ‌న వెంటే న‌డుస్తు న్నారు.

దీంతో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోలేక పోయార‌నే వాద‌న ఉంది. ఇక‌, పార్టీలు మార‌డం.. త‌న కంటూ.. కేడ‌ర్‌ను ఏర్పాటు చేసుకోక పోవ‌డం వంటివి కూడా పాలేటి ప్ర‌తిబంధ‌కంగానే మారాయ‌ని.. చెబు తున్నారు. ప్ర‌స్తుతం.. ఆయ‌న వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న‌సు మాత్రం బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతోంద‌ని చెబుతున్నారు. అంటే.. వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌కు గుర్తింపు లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని.. క‌నీసం పార్టీలోనూ గుర్తింపు ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే పాలేటి పార్టీ మారిపోతారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీంతో ఇప్పుడు పాలేటి వ్య‌వ‌హారంపై చీరాల‌లో విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. పార్టీలు మార‌డం.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేకంగా ఒక కేడ‌ర్‌ను ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవ‌డం.. వంటి విష‌యాల్లో అవుట్ డేటెడ్ పాలిటిక్స్ కార‌ణంగా ఒంట‌రి అయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆయ‌న మాత్రం పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని మీడియా మీటింగులు పెట్టి మ‌రీ.. చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదు. పోనీ.. పాలేటి వ్యూహాన్ని పార్టీలేమైనా.. ప‌ట్టించుకున్నాయా.?  రండి సార్‌..! అంటూ ఆహ్వానాలు ఏమైనా అందాయా? అంటే.. అది కూడా లేదు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పాలేటి రెంటికీ చెడ్డ రేవ‌డి అయ్యార‌నే కామెంట్లు జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>