PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf2cda742-ddbf-4a18-b8ee-fc35592e9044-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf2cda742-ddbf-4a18-b8ee-fc35592e9044-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా వైద్యానికి సంబంధించి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్న నేపధ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 185 ను జారీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ... ఈ ఉత్తర్వులు ఏపీ లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ చికిత్స కోసం అసాధారణంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రోగుల ఆర్థిక స్థితిగతులకు మించి డబ్బు డిమాండ్ చేయడం corona virus,ap;suma;suma kanakala;mandula;andhra pradesh;letter;oxygen;house;indianఇంతకు మించి రూపాయి వసూలు చేసినా మర్యాదగా ఉండదు, ఏపీలో కరోనా వైద్యం ఫీజులు ఇవే...!ఇంతకు మించి రూపాయి వసూలు చేసినా మర్యాదగా ఉండదు, ఏపీలో కరోనా వైద్యం ఫీజులు ఇవే...!corona virus,ap;suma;suma kanakala;mandula;andhra pradesh;letter;oxygen;house;indianSat, 01 May 2021 10:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వైద్యానికి సంబంధించి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్న నేపధ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ  చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 185 ను జారీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ... ఈ ఉత్తర్వులు ఏపీ లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వర్తిస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ చికిత్స కోసం అసాధారణంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రోగుల ఆర్థిక స్థితిగతులకు మించి డబ్బు డిమాండ్ చేయడం వల్ల రోగులకు చికిత్స ఆలస్యమై వైరస్ వ్యాప్తికి ప్రైవేట్ హాస్పిటల్స్ కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కారణంగా కోవిడ్ బారినపడ్డ వారి చికిత్సకు రేట్లను ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ రేట్లను నిర్ధారించేందుకు ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ కమిటీ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు లతో, నిపుణులతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో విస్తృతంగా చర్చలు జరిపిందని పేర్కొంది. కోవిడ్ పేషెంట్లకు వసూలు చేయాల్సిన చికిత్స రేట్ల వివరాలను నిర్ధారించిందని వివరించింది. మొత్తం చికిత్సా విధానాన్ని నాలుగు కేటగిరీలుగా ప్రహుత్వం విభజించింది.

మొదటి కేటగిరీలో నాన్ క్రిటికల్ కొవిడ్-19 ట్రీట్మెంట్ కోసం NABH ఆసుపత్రిలో రోజుకు నాలుగు వేలు,నాన్ NABH ఆసుపత్రిలో 3600 రూపాయలు

ఆక్సిజన్ అందిస్తూ నాన్ క్రిటికల్ కోవిడ్  ట్రీట్మెంట్ కోసం 6500,5850 రూపాయలు

NIV తో తో క్రిటికల్ కోవిడ్ ట్రీట్మెంట్ అందించేందుకు12,000,10800

వెంటిలేటర్ తో ఐసియులో చికిత్స కు 16,000,14,400గా ఫైనల్ చేసారు.  

ఈ రేట్లలోనే ఆసుపత్రులు కన్సల్టేషన్, నర్సింగ్ చార్జెస్, రూమ్స్ స్టే, భోజనం, కొవిడ్ టెస్టింగ్, మానిటరింగ్, పరీక్షలు, మందులు తదితర ఖర్చులు అన్నీ వస్తాయని తెలిపారు. కోవిడ్ హాస్పిటల్స్ గా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల కొవిడ్ పేషెంట్ ను వచ్చిన వెంటనే ఎటువంటి అడ్వాన్సు డిమాండ్ చేయకుండా జాయిన్ చేసుకోవాలని తెలిపింది. హెచ్ఆర్ సీటీ ఛార్జీలను మూడు వేలకు మించకుండా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఫిలిం, రిపోర్టు లకు ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయరాదని, పేషెంట్ లకు రేమిడిసివిర్ ఇంజక్షన్ ఉపయోగిస్తే వోయిల్ కి 2500 టోసిలీజుమోబ్ ఇంజక్షన్ వాడితే 30,000 మాత్రమే వసూలు చేయాలని తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌బ్జాల‌పై విచార‌ణ షురూ ..ఈటల పై వేటు త‌ప్ప‌దా.. ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>