KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrensf5598db0-4dd9-4ccc-bdbb-afb3aa082955-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrensf5598db0-4dd9-4ccc-bdbb-afb3aa082955-415x250-IndiaHerald.jpgపిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరునెలల పిల్లల నుండి పన్నెడు నెలలు వచ్చేవరకు రోజు చూసే వారిని గుర్తుపట్టడం, పేరు పెట్టి పిలిస్తే అటువైపుగా తిరగడం చేస్తుంటారు. వద్దు, టాటా అన్నట్టుగా చేతులు కదుపుతుంటారు.childrens;manu;nithya new;tara;korcha;vegetable marketబుడుగు: 5 సంవత్సరాల పిల్లలలో ఇలా చేస్తే మంచి ఎదుగుదల ఉంటుంది..!బుడుగు: 5 సంవత్సరాల పిల్లలలో ఇలా చేస్తే మంచి ఎదుగుదల ఉంటుంది..!childrens;manu;nithya new;tara;korcha;vegetable marketSat, 01 May 2021 17:00:20 GMTపిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరునెలల పిల్లల నుండి పన్నెడు నెలలు వచ్చేవరకు రోజు చూసే వారిని గుర్తుపట్టడం, పేరు పెట్టి పిలిస్తే అటువైపుగా తిరగడం చేస్తుంటారు. వద్దు, టాటా అన్నట్టుగా చేతులు కదుపుతుంటారు. ఆ వయసులో ఉన్న పిల్లలకు ఆట వస్తువులు ఇవ్వడంతో పాటు మీరు కూడా కూర్చుని వారితో ఆడుకోవాలి. 1-2 సంవత్సరాలు ఉన్న పిల్లలు చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తూ,లయబద్ధంగా కాళ్ళు, చేతులు కదిలిస్తూ పాటలు పాడతారు. చిన్న చిన్న పనులు చెబితే చేస్తుంటారు. తోటి వయసు పిల్లలను చూసి నవ్వుతుంటారు.

అయితే రెండేళ్ళు వచ్చేసరికి మలమూత్ర విసర్జన అవసరాన్ని ముందే తెలియజేస్తారు. పిల్లలను కుటుంబ సభ్యులతో, తరచుగా ఇంటికి వచ్చే అతిధులను ఒకటికి రెండు సార్లు పరిచయం చేస్తుండాలి. అతిధులను పెద్దవారిని ‘ నమస్తే ‘ అని గౌరవప్రదమైన మాటలు, చేతలతో పలకరించడం ఆ వయస్సు నుంచే అలవాటు చేయాలి. వారంతట వారే భోజనం చేయడం, నీళ్ళు తాగడం వంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇంట్లో తనకంటే చిన్న పిల్లల తో ఆడుకునే విధం గా చూడాలి. మార్కెట్ కు తీసుకు వెళ్ళేటప్పుడు , దారిలో కనిపించే వస్తువులు, మనుష్యులను, నిత్యం చూసే వాహనాలు, రోజూ వాడుకునే కూరగాయలు చూపిస్తూ వాటి పేర్లు చెప్పండి.

ఇక ఇంట్లో ఉండే ఇతర సభ్యుల బంధుత్వం గురించి కూడా బిడ్డకు తెలియచేస్తూ ఉండాలి. 2-3 సంవత్సరాల పిల్లలకు బట్టలు వేసుకోవడం, తీయడంలో సహకరిస్తూ నేర్పించాలి. వారంతట వారు భోజనం చేయడం, కంచం, గ్లాసు వంటి వస్తువులు పట్టుకోవడం వంటివి చేయగలుగుతారు. వారంతట వారే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోగలరు. తనకు కావాల్సింది అడగడం, నిర్ణీత సమయం ప్రదేశంలో మలమూత్ర విసర్జన చేయడానికి అలవాటు పడతారు. బిడ్డ తన బట్టలు తానే వేసుకోవడం, తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల చూపు బిజెపి వైపు...?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>