PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcrcc02983f-578b-4f78-be40-1d71ddb992d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcrcc02983f-578b-4f78-be40-1d71ddb992d5-415x250-IndiaHerald.jpgబరువుగా ఉన్నప్పుడు.. ఎంతకూ చిక్కకుండా జారిపోతూ.. వేగంగా కదిలే గుణానికి తగ్గట్లే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తుంటారు. కొన్ని నిర్ణయాల్నిఆయన మెరుపు వేగంతో తీసుకుంటారు. జరుగుతున్న పరిణామాలకు ధీటుగా.. ఎవరికి అర్థం కానంత వేగంగాపావులు కదపటంలో ఆయనకు ఆయనే సాటి. ఇదే గుణం తెలంగాణ రాష్ట్ర సాధన లాంటి కష్టమైన టాస్కును విజయవంతంగా పూర్తి చేసేలా చేసింది. మొదటి టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన.. రెండో టర్మ్ లో అప్పుడే రెండేళ్లను పూర్తి చేశారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ లేనంత kcr;kcr;telangana;friday;letterకేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?kcr;kcr;telangana;friday;letterSat, 01 May 2021 10:20:00 GMTపాదరసం.. అదేనండి మెర్క్యురీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత బరువైన ఈ పదార్థానికి చాలానే పోలికలు ఉంటాయి. లీటరు నీరు పట్టే బాటిల్ లో పాదరసాన్ని పోస్తే.. దాదాపు నాలుగైదు కేజీలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతటి సడువు (బరువైన వస్తువుని ఇలా కూడా అంటారు) పాదరసం సొంతం. ఇంత బరువుగా ఉన్న పాదరసంలో మరో గుణం.. ఎంతకూ చిక్కదు. నేల మీద పడిన తర్వాత దాన్ని పట్టుకోవాలంటే అంత తేలికైన విషయం కాదు. ఎంతో నేర్పు ఉంటే తప్పించి పట్టుకోలేం.

బరువుగా ఉన్నప్పుడు.. ఎంతకూ చిక్కకుండా జారిపోతూ.. వేగంగా కదిలే గుణానికి తగ్గట్లే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తుంటారు. కొన్ని నిర్ణయాల్నిఆయన మెరుపు వేగంతో తీసుకుంటారు. జరుగుతున్న పరిణామాలకు ధీటుగా.. ఎవరికి అర్థం కానంత వేగంగాపావులు కదపటంలో ఆయనకు ఆయనే సాటి. ఇదే గుణం తెలంగాణ రాష్ట్ర సాధన లాంటి కష్టమైన టాస్కును విజయవంతంగా పూర్తి చేసేలా చేసింది. మొదటి టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన.. రెండో టర్మ్ లో అప్పుడే రెండేళ్లను పూర్తి చేశారు.

అయితే.. ఇటీవల కాలంలో ఆయన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడూ లేనంత జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా లాంటి విపత్తు వేళలో.. నిర్ణయాల్ని వేగంగా తీసుకోవాలి. కానీ.. అందుకు భిన్నంగా న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన తర్వాత కానీ ఆయన ప్రభుత్వం మేలుకోవటం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ విధించటం లాంటివి ఎందుకు చేయరంటూ హైకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యాక కానీ.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. అలా పెట్టిన రాత్రి కర్ఫ్యూ గడువు ఈ రోజుతో తీరనుంది. మరి.. దాన్ని కొనసాగించాలా? ఆపేయాలా? అన్న దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నది లేదు.

ఇదే విషయాన్ని కోర్టు ప్రశ్నిస్తే.. అందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది. గడువు శుక్రవారంతో ముగియనుంది కాబట్టి.. శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించటం.. దానికి కోర్టు తీవ్రంగా ఆక్షేపించటం గమనార్హం. విపత్తు వేళ.. అందునా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. గడువు తీరే రోజు వరకు వెయిట్ చేయకుండా.. ముందే నిర్ణయం తీసుకోవటం తప్పేం లేదు కదా? పాదరసంలా వేగంగా కదిలే కేసీఆర్.. ఇటీవలకాలంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎందుకంతగా నెమ్మదిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆయనలోని పాదరసం గుణం తగ్గిపోవటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>