PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etala-kcr0684387e-0819-41bc-a3c0-6bbc4637ce24-415x250-IndiaHerald.jpgతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందా...? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విషయంలో ఆలోచించకుండా ముందడుగు వేశారా...? ప్రతిపక్షాలకు ఈటెల రాజేందర్ విషయంలో అవకాశం ఇచ్చేసారా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ కీలకం. ముందు నుంచి కూడా ఆయన టిఆర్ఎస్ పార్టీ నిర్మాణం మొత్తం కూడా దగ్గర్నుంచి చూడటమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో టిఆర్ఎస్ పాkcr,eetala rajendar,trs,ts;kcr;jeevan;bharatiya janata party;eatala rajendar;jeevan reddy;telangana;congress;backward classes;chief minister;minister;letter;reddy;etela rajender;dookudu;party;mantraఈటె దింపి తప్పు చేసారా?ఈటె దింపి తప్పు చేసారా?kcr,eetala rajendar,trs,ts;kcr;jeevan;bharatiya janata party;eatala rajendar;jeevan reddy;telangana;congress;backward classes;chief minister;minister;letter;reddy;etela rajender;dookudu;party;mantraSat, 01 May 2021 13:50:25 GMTతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందా...? ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విషయంలో ఆలోచించకుండా ముందడుగు వేశారా...? ప్రతిపక్షాలకు ఈటెల రాజేందర్ విషయంలో అవకాశం ఇచ్చేసారా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ కీలకం. ముందు నుంచి కూడా ఆయన టిఆర్ఎస్ పార్టీ నిర్మాణం మొత్తం కూడా దగ్గర్నుంచి చూడటమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.

సీఎం కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని అదేవిధంగా శాసనసభలో ఎమ్మెల్యేలను ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు అదే ఈటెల రాజేందర్ ని కొన్ని అంశాల్లో టార్గెట్ చేసి ఆయన పై విచారణకు ఆదేశించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళ ఎవరు మీద కూడా సీఎం కేసీఆర్ ఇంత వేగంగా విచారణకు ఆదేశించిన పరిస్థితి లేదు.

కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో దూకుడుగా వెళ్ళడంతో టిఆర్ఎస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ జన సమితి, షర్మిల అందరూ కూడా ఈటెల రాజేందర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ ముందు నుంచి కూడా కష్టపడి సంపాదించారని కానీ ఆయన మీద కక్ష సాధింపు ముందుకు వెళ్లారు అంటూ ఆయన ఆరోపణలు చేశారు. షర్మిల టీం కూడా ఈటల రాజేందర్ కు అండగా నిలిచింది.

అటు బిజెపి నేతలు కూడా ఈటెల రాజేందర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ తొందరపడ్డారు అని ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆయనను టార్గెట్ చేస్తున్న సమయంలో అనవసరంగా టిఆర్ఎస్ పార్టీలో చీలిక తీసుకువచ్చే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరించారని పలువురు మండిపడుతున్నారు. దానికితోడు బీసీ నేత కావడం ఉద్యమనేత కావడంతో ఈటెల రాజేందర్ కు కొన్ని సంఘాల నుంచి కూడా మద్దతిచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. గతంలో ఉద్యమంలో పనిచేసిన వారు ఇప్పుడు మళ్ళీ ఈటెల రాజేందర్ తో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శాఖల తొలగింపు : రాజీనామా చేయిస్తారా లేక.. భ‌ర్త‌ర‌ఫ్‌నా ?

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>