MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-fae00c71-8b79-4964-95c9-16f3224d7b0a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-fae00c71-8b79-4964-95c9-16f3224d7b0a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కింగ్ నాగార్జునకు ప్రయోగాత్మక సినిమాలు చేస్తాడు అనే పేరు ఉంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఆయన కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ అండదండలు అందిస్తూ వస్తున్నారు.. వ్యాపార రంగంలో కూడా అందరికంటే కాస్త ముందు ఉండే నాగార్జున తన సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లాంచ్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేశారు. నిజానికి అల్లు అరవింద్ ఆహా యాప్ కంటే ముందు నాగార్జున ఇలాంటి ఒక యాప్ సిద్ధం చేయాలని ఆలోచన చేశాడు. కానీ తెలుగులో వర్కవుట్ అవుతుందో లేదో మరో ఆలోచనతో ఆయన వెనకడుగు వేశారు. ఇంతలో ఆహా రావడం అది ఇంటర్నేషనల్ యాప్స్tollywood;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;akhil akkineni;annapurna;nageshwara rao akkineni;tollywood;telugu;king;king 1నాగార్జున ప్లానింగ్..'మనం' మనది అంటూ !నాగార్జున ప్లానింగ్..'మనం' మనది అంటూ !tollywood;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;akhil akkineni;annapurna;nageshwara rao akkineni;tollywood;telugu;king;king 1Sat, 01 May 2021 15:00:00 GMTటాలీవుడ్ లో కింగ్ నాగార్జునకు ప్రయోగాత్మక సినిమాలు చేస్తాడు అనే పేరు ఉంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఆయన కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ అండదండలు అందిస్తూ వస్తున్నారు.. వ్యాపార రంగంలో కూడా అందరికంటే కాస్త ముందు ఉండే నాగార్జున తన సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లాంచ్ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేశారు. నిజానికి అల్లు అరవింద్ ఆహా యాప్ కంటే ముందు నాగార్జున ఇలాంటి ఒక యాప్ సిద్ధం చేయాలని ఆలోచన చేశాడు. కానీ తెలుగులో వర్కవుట్ అవుతుందో లేదో మరో ఆలోచనతో ఆయన వెనకడుగు వేశారు. 

ఇంతలో ఆహా రావడం అది ఇంటర్నేషనల్ యాప్స్ తో పోటీ పడుతూ కంటెంట్ పుష్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు నాగార్జున కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఆ యాప్ కు 'మనం' అనే పేరు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజానికి నాగార్జున ఆధ్వర్యంలో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇందులో విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కింద కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటిదాకా అలాంటి వాటిలో బాగా వచ్చిన వాటిని కూడా ఎక్కడ రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక మీదట నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అఖిల్ మొదలగువారు చేసే సినిమాలు, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద రిలీజ్ అయ్యే సినిమాలు ఈ యాప్ లో పుష్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే చర్చలు అన్నీ పూర్తయ్యాయని వీలైనంత త్వరలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నా శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారుగా..సంతోషం..!!

OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>