MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-08e44286-02a3-48e4-a3fa-b41f3f4e779c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-08e44286-02a3-48e4-a3fa-b41f3f4e779c-415x250-IndiaHerald.jpgపది సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను ఆలోచించి దానికి ‘కోబలి’ అన్న టైటిల్ ఫిక్స్ చేసాడు. రాయలసీమ నేపధ్యంలో నడిచే ఈకథ పవన్ భావజాలానికి బాగా సరిపోతుంది అన్న ఉద్దేశ్యంతో అప్పట్లో ఈమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేశాడు అన్నవార్తలు అప్పట్లో వచ్చాయి.ఈ టైటిల్ చాల పవర్ ఫుల్ గా ఉండటంతో పవన్ అభిమానులు వెంటనే కనెక్ట్ అయి పవన్ ను కోబలి గా ఊహించుకుంటు అభిమానులు కొన్ని పోష్టర్ లు డిజైన్ చేసి వాటితో సోషల్ మీడియాలో హడావిడి చేసారు. ఆ తరువాత త్రివిక్రమ్ ఆ కథను పవన్ తో తTRIVIKRAM;;pawan;kalyan;trivikram srinivas;vamsi;vamsi paidipally;cinema;rayalaseema;remake;agnyaathavaasi;attharintiki darediమళ్ళీ చర్చలలోకి వస్తున్న కోబలి !మళ్ళీ చర్చలలోకి వస్తున్న కోబలి !TRIVIKRAM;;pawan;kalyan;trivikram srinivas;vamsi;vamsi paidipally;cinema;rayalaseema;remake;agnyaathavaasi;attharintiki darediSat, 01 May 2021 09:00:00 GMT
పది సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను ఆలోచించి దానికి ‘కోబలి’ అన్న టైటిల్ ఫిక్స్ చేసాడు. రాయలసీమ నేపధ్యంలో నడిచే ఈకథ పవన్ భావజాలానికి బాగా సరిపోతుంది అన్న ఉద్దేశ్యంతో అప్పట్లో ఈమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేశాడు అన్నవార్తలు అప్పట్లో వచ్చాయి.


ఈ టైటిల్ చాల పవర్ ఫుల్ గా ఉండటంతో పవన్ అభిమానులు వెంటనే కనెక్ట్ అయి పవన్ ను కోబలి గా ఊహించుకుంటు అభిమానులు కొన్ని పోష్టర్ లు డిజైన్ చేసి వాటితో సోషల్ మీడియాలో హడావిడి చేసారు. ఆ తరువాత త్రివిక్రమ్ ఆ కథను పవన్ తో తీయకుండా ‘అత్తారింటికి దారేది’ ‘అజ్ఞాతవాసి’ మూవీలను తీసాడు.


ఇప్పుడు పవన్ అభిమానులు మర్చిపోయిన ఆ కోబలి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఇప్పటికి తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా మళ్ళీ రీ రైట్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ తయారు చేసే ఆ స్క్రిప్ట్ తనకోసం కాదని దర్శకుడు వంశీ పైడిపల్లి పవన్ తో తీయడానికి ప్రయత్నిస్తున్న మూవీకి త్రివిక్రమ్ ‘కోబలి’ స్క్రిప్ట్ వంశీ పైడిపల్లి దగ్గరకు చేరింది అంటు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి పవన్ ఇప్పటివరకు చాల సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ అతడు నటించిన ఏ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రాలేదు. దీనితో పవన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చే విధంగా ‘కోబలి’ స్క్రిప్ట్ అన్నివిధాల బాగుంటుందని త్రివిక్రమ్ సలహాతో ఇప్పుడు అదే స్క్రిప్ట్ మార్పులు చేసుకుని పవన్ తో వంశీ పైడిపల్లి తీయబోయే మూవీ కథగా మారింది అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కొషియం’ మూవీ రీమేక్ స్క్రిప్ట్ ను కూడ త్రివిక్రమ్ రాస్తున్నాడు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ‘కోబలి’ వంశీ పైడిపల్లి పవన్మూవీ ప్రాజెక్ట్ గా మారితే త్రివిక్రమ్ డైరెక్ట్ గా పవన్ తో సినిమాను చేయలేకపోయినా రెండు సినిమాలకు పరోక్ష సహాయం అందిస్తున్నాడు అనుకోవాలి..  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి ఈటల ఆసక్తికర ట్వీట్..!!

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>