PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling492bdacd-ed2d-4210-848b-dc76dd62e9f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polling492bdacd-ed2d-4210-848b-dc76dd62e9f9-415x250-IndiaHerald.jpgఎన్నిక‌ల స‌మ‌యంలో సాధార‌ణంగా ఉద‌యం వేళ‌ల్లోనే ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకొనేందుకు బారులు తీరుతారు. దీనికితోడు వేస‌వికాలం కావ‌డంతో ఉద‌యాన్నే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు వ‌స్తార‌ని అధికారులు భావించారు. కానీ ఉద‌యం 11గంటల వ‌ర‌కు కూడా పోలింగ్ మంద‌కొడిగా సాగింది. ఉద‌యం11గంట‌ల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు చూస్తే.. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 23.41శాతం, వ‌రంగ‌ల్ 23.42శాతం, సిద్ధిపేట‌31.39శాతం, న‌కిరేక‌ల్ 14.83శాతం, జ‌డ్చ‌ర్ల 23శాతం, అచ్చంపేట 38.72శాతం, కొత్తూరు 44శాతం ఓటింగ్ న‌మోదైంది.polling;tara;central government;oxygen;pettaక‌రోనా ఎఫెక్ట్ .. మంద‌కొడిగా పోలింగ్!క‌రోనా ఎఫెక్ట్ .. మంద‌కొడిగా పోలింగ్!polling;tara;central government;oxygen;pettaFri, 30 Apr 2021 11:39:34 GMT
ఎన్నిక‌ల స‌మ‌యంలో సాధార‌ణంగా ఉద‌యం వేళ‌ల్లోనే ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకొనేందుకు బారులు తీరుతారు. దీనికితోడు వేస‌వికాలం కావ‌డంతో ఉద‌యాన్నే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల‌కు వ‌స్తార‌ని అధికారులు భావించారు. కానీ ఉద‌యం 11గంటల వ‌ర‌కు కూడా పోలింగ్ మంద‌కొడిగా సాగింది. ఉద‌యం11గంట‌ల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు చూస్తే.. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో 23.41శాతం, వ‌రంగ‌ల్ 23.62శాతం, సిద్ధిపేట‌31.39శాతం, న‌కిరేక‌ల్ 14.83శాతం, జ‌డ్చ‌ర్ల 23శాతం, అచ్చంపేట 38.72శాతం, కొత్తూరు 44శాతం ఓటింగ్ న‌మోదైంది.  సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు అధికారుల పోలింగ్ కేంద్రాల వ‌ద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.  పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.  ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎమర్జెన్సీ సర్వీసుతో పాటుగా ఆక్సిజన్ ను సిలిండర్లను సిద్ధం చేశారు.

క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా పోలింగ్ మంద‌కొడిగా సాగుతుండ‌టంతో అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న నెల‌కొంది. దీంతో త‌మ‌కు అనుకూల‌మైన ఓట‌ర్ల‌ను ప్ర‌త్యేక వాహ‌నాల ద్వారా పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లించి ఓటు హ‌క్కు వినియోగించుకోనేలా చేస్తున్నారు. ఎలాగూ పోలింగ్‌శాతం త‌క్కువ‌గా న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్న అభ్య‌ర్థులు.. త‌మ‌కు అనుకూలం అనుకున్న వారి ఓట్లు పూర్తిస్థాయిలో ప‌డేలా చూసుకుంటున్నారు. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌ల విష‌యానికి వ‌స్తే ఖ‌మ్మంలో ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు క్యూ క‌ట్ట‌గా, ప‌లు కేంద్రాల్లో ఓట‌ర్లు ఒక్కొక్క‌రుగా వ‌స్తుండ‌టం క‌నిపించింది. వ‌రంగ‌ల్‌లోసైతం అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇక సాధార‌ణ రోజుల్లోనే ఓటు హ‌క్కును వినియోగించుకోని వారు ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అస్స‌లే ఆస‌క్తి చూప‌డం లేదు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>