MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirus4cbf2f7f-4867-4470-ae58-8bbf2b291a2e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirus4cbf2f7f-4867-4470-ae58-8bbf2b291a2e-415x250-IndiaHerald.jpgప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వివేక్ మరణంతో అటు తమిళ పరిశ్రమ ఇటు తెలుగు పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ సందర్భంలో వివేక్ సహనటుడు మన్సూర్ ఖాన్ అతని మరణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివేక్ టీకా వేసుకున్న కొద్ది రోజుల అనంతరం అస్వస్థకు గురయిన విషయం వాస్తవమే. కానీ అతను మరణించింది టీకా వల్ల కాదు, గుండె పోటు వల్ల అని డాక్టర్స్ ధృవీకరించారు.CORONAVIRUS;aly khan;ali;vivek;industries;police;tamil;court;lawyer;heart;chennai;letter"కరోనా వ్యాక్సిన్" కేసులో తమిళ నటుడికి ముందస్తు బెయిలు ... ?"కరోనా వ్యాక్సిన్" కేసులో తమిళ నటుడికి ముందస్తు బెయిలు ... ?CORONAVIRUS;aly khan;ali;vivek;industries;police;tamil;court;lawyer;heart;chennai;letterFri, 30 Apr 2021 08:53:00 GMTతమిళ హాస్య నటుడు వివేక్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వివేక్ మరణంతో అటు తమిళ పరిశ్రమ ఇటు తెలుగు పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ సందర్భంలో వివేక్ సహనటుడు మన్సూర్ ఖాన్ అతని మరణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివేక్ టీకా వేసుకున్న కొద్ది రోజుల అనంతరం అస్వస్థకు గురయిన విషయం వాస్తవమే. కానీ అతను మరణించింది టీకా వల్ల  కాదు, గుండె పోటు వల్ల అని డాక్టర్స్ ధృవీకరించారు. కానీ మన్సూర్ ఖాన్ మాత్రం వివేక్ చనిపోయింది టీకా వికటించడం వల్లే అని విషయాన్ని పెద్దది చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రజలపై వ్యాక్సిన్ పై అనుమానాలు వచ్చే అవకాశం ఉండడంతో...వెంటనే చెన్నై నగర కమిషనర్ ప్రకాష్ మన్సూర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే ఈ అరెస్టు నుండి తప్పించుకోవడానికి చెన్నై సెషన్స్ కోర్టులో బెయిలు కు అప్లై చేశారు. కానీ సెషన్స్ కోర్ట్ ఈ పిటీషన్ ను కొట్టి వేసింది.  ఆ తరువాత మద్రాస్ హై కోర్ట్ లో బెయిలు పిటీషన్ ను వేయడం జరిగింది. ఈ కేసుపై నిన్న హై కోర్ట్ విచారించడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ తరపున న్యాయవాది రాధాకృష్ణన్ మాట్లాడుతూ "నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేక ఉద్వేగంలో ఈ వ్యాఖ్యలు చేశాడని కోర్టుకు తెలియచేశారు. అంతే కాకుండా ఆ తరువాత పశ్చత్తాప పడ్డాడని కోర్ట్ దృష్టికి తీసుకు రావడం జరిగింది. తదుపరి వాదనలను విన్న న్యాయమూర్తి దండపాణి ఏది ఏమైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరియు ఎంతో మంది శాస్త్రజ్ఞులు రాత్రనక పగలనక కష్టపడి కనిపెట్టిన వ్యాక్సిన్ పై ఇలా మాట్లాడడం సరి కాదని మన్సూర్ ఖాన్ ను కోర్ట్ మందలించింది. 

అంతే కాకుండా టీకాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసి 2 లక్షలు జరిమానాగా ఇవ్వాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది. చివరిగా మన్సూర్ అలీ ఖాన్ కు ముందస్తు బెయిలు ను ఇచ్చింది. ఇలా వ్యాక్సిన్ ల పనితీరుపై వ్యతిరేకంగా మాట్లాడడం ముమ్మాటికీ తప్పే, ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమంపై మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ, అనుమానాలు కలిగించే ప్రచారాలు చేయడం తగదని తెలుసుకోండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నో లాక్‌డౌన్‌.. మ‌రోవారంపాటు నైట్ క‌ర్ఫ్యూనే..?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>