Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-vaccine-lone-vairuse1cf8bb03-4153-4f9f-9fc9-aa47c1105363-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-vaccine-lone-vairuse1cf8bb03-4153-4f9f-9fc9-aa47c1105363-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ కబళిస్తున్న వేళ అన్ని దేశాలు కూడా వైరస్ ను కట్టడి చేసేందుకు వాక్సిన్ తయారీలో నిమగ్నమై పోగా.. కొన్ని దేశాలు టీకా తయారీ లో విజయం సాధించాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆయా దేశాలు కూడా తమ దేశ వ్యాక్సిన్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. పూర్తిగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఏ దేశపు వ్యాక్సిన్ మొదట అందుబాటులోకి వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా రష్యా వ్యాక్సిన్ తెరమీదకి వచ్చింది. అప్పటి వరకు ఈ వ్యాక్సిన్ గురించి Vaccine;india;brazil;russia;aqua;father;v;coronavirusవామ్మో.. వ్యాక్సిన్ లోనే వైరస్..?వామ్మో.. వ్యాక్సిన్ లోనే వైరస్..?Vaccine;india;brazil;russia;aqua;father;v;coronavirusFri, 30 Apr 2021 08:30:00 GMTకరోనా వైరస్ కబళిస్తున్న వేళ అన్ని దేశాలు కూడా వైరస్ ను కట్టడి చేసేందుకు వాక్సిన్ తయారీలో నిమగ్నమై పోగా..  కొన్ని దేశాలు టీకా తయారీ లో విజయం సాధించాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆయా దేశాలు కూడా తమ దేశ వ్యాక్సిన్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. పూర్తిగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఏ దేశపు వ్యాక్సిన్ మొదట అందుబాటులోకి వస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా రష్యా వ్యాక్సిన్  తెరమీదకి వచ్చింది.  అప్పటి వరకు ఈ వ్యాక్సిన్ గురించి కనీసం మాటా ముచ్చట కూడా లేదు.



 కానీ ఒక్కసారిగా తమ దేశపు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందని కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఎంతో సమర్థవంతమైంది అని నిరూపితం అయింది అంటూ రష్యా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ తర్వాత రష్యా టీకా పై మాత్రం ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇక ఈ టీకా తయారీ కోసం భారత్ ను సంప్రదించగా క్లినికల్ ట్రయల్స్ జరిగేంత వరకు కూడా టీకా ఉత్పత్తి చేయలేవు అంటూ భారత్ తేల్చి చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం రష్యా నుంచి స్పుత్నిక్ వి తొలి బ్యాచ్ శనివారం రోజున భారత్కు చేరనుంది.


 ఇలాంటి నేపథ్యంలో రష్యా టీకా గురించి ఇటీవలే బ్రెజిల్ ఒక ఆందోళనకరమైన విషయం బయట పెట్టింది. తమ దేశానికి రష్యా పంపిన స్పుత్నిక్ వి టీకాలో జలుబును కలిగించే ఎడినో వైరస్ ఉంది అంటూ బ్రెజిల్ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎడినో వైరస్ పునరుత్పత్తి కూడా అయినట్లు గుర్తించాము అంటూ తెలిపింది. అందుకే రష్యా టీకా దిగుమతులపై నిషేధం విధించాము అంటూ బ్రెజిల్  ప్రకటించింది. అయితే ఎడినో  వైరస్ లో జన్యు మార్పులతో పాటు మనిషి శరీరంలో అది పెరగకుండా ఉండే విధంగా మార్పులు చేసి వ్యాక్సిన్ లో వినియోగించినట్లు రష్యా తెలిపింది అన్న విషయం తెలిసిందే. అయితే బ్రెజిల్ అనూహ్య ప్రకటన తర్వాత భారతీయ ఎలాంటి నిర్ణయం తీసుకొపోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>