LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedకరోనా విషయంలో జనంలో అనేక అపోహలు ఉన్నాయి. ఏం చేయాలి.. ఏం చేయకూడదు అన్న విషయంలో చాలామందికి క్లారిటీ లేదు.. కరోనా విషయంలో దేనికి భయపడాలంటే.. కరోనా రాకముందే భయపడాలి. మనకు వస్తుందేమో అన్న భయంతో సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా.. రాకుండా ఉండటానికి చూసుకోవాలి. అంటే.. మన పనులు, ఉద్యోగాలు మానుకోమని చెప్పడం లేదు. నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు. మరి దేనికి భయపడకుండా ఉండాలి.. భయమనేది ముందే ఉండాలి... కానీ కరోనా వచ్చాక భయపడొద్దు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉంటే వచ్చే అవకాశం తగ్coronavirus;vitamin;sugar;garlicకని కరోనా: దేనికి భయపడాలి.. దీనికి భయపడొద్దు..?కని కరోనా: దేనికి భయపడాలి.. దీనికి భయపడొద్దు..?coronavirus;vitamin;sugar;garlicFri, 30 Apr 2021 23:03:00 GMTకరోనా విషయంలో జనంలో అనేక అపోహలు ఉన్నాయి. ఏం చేయాలి.. ఏం చేయకూడదు అన్న విషయంలో చాలామందికి క్లారిటీ లేదు.. కరోనా విషయంలో దేనికి భయపడాలంటే.. కరోనా రాకముందే భయపడాలి. మనకు వస్తుందేమో అన్న భయంతో సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా.. రాకుండా ఉండటానికి చూసుకోవాలి.  అంటే.. మన పనులు, ఉద్యోగాలు మానుకోమని  చెప్పడం లేదు. నిర్లక్ష్యంగా  మాత్రం ఉండొద్దు.

మరి దేనికి భయపడకుండా ఉండాలి.. భయమనేది ముందే ఉండాలి... కానీ కరోనా వచ్చాక భయపడొద్దు.  ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉంటే వచ్చే అవకాశం తగ్గుతుంది. కరోనా వచ్చిన తర్వాత మనం భయపడితే ఆ ప్రభావం మన ఇమ్యూనిటీ మీద పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లో భయపడొద్దు. మన ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది. పిల్లలు చాలా కాలంగా ఇంట్లోనే ఉంటున్నారు. కొన్నాళ్లుగా వాళ్లని బయటకు ఆడుకోవడానికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఆపేయండి. కుదిరితే.. మార్నింగ్ ఒక అరగంట.. లేత ఎండ వారి మీద పడేలా చూడండి. టెర్రస్ పైనో..ఇంటి ముందరో.. జనాలతో కలవకుండా నడిపించండి.

మీకు ఏమైనా రెస్పిరేటరీ డిసీజ్, అలెర్జీ, బీపీ, షుగర్ లాంటివి ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కనీసం ఆన్ లైన్  కన్సల్టేషన్ అయినా తీసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదీ నమ్మేయకండి.  ముఖ్యంగా కర్పూరాన్ని గుడ్డలో కడ్డుకోండి.. కందగడ్డను ఒంటికి చుట్టుకోండి.. వంటి ట్రాష్ ను నమ్ముకుని.. రిస్కు చేయొద్దు. హోం రెమిడీస్  మన ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి.  మన ఇంట్లో వాడే.. గార్లిక్, పసుపు, వంటి వాటిల్లో యాంటీ యాక్సిడెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లు ఉంటాయి. కానీ.. అవన్నీ రోగం రాకముందు మన శరీరాన్ని సిద్ధం చేయడానికి. రోగం వచ్చాక.. అలాంటివి సరిపోవు. మెడిసిన్ కావాలి. వాటిని నమ్ముకుని రిస్కులో పడొద్దు.

కరోనా మనల్ని నేరుగా చంపదు. పరోక్షంగా మాత్రమే దానివల్ల చనిపోతాం. కరోనాకు మన రోగనిరోధకవ్యవస్థ ఎలా స్పందిస్తుంది.. అన్న దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువుగా స్పందించినా.. తక్కువుగా స్పందించినా సమస్యే.. ఇక విటమిన్ డి చాలా అవసరం. శాఖాహారులు విటమిన్ బీ 12 కోసం ఆల్టర్నేటివ్ ఫుడ్, సప్లిమెంట్స్ చూసుకోండి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడైతే బాగానే వస్తున్నాయి .... ప్చ్, పాపం ఇక్కడే వర్కౌట్ అవ్వట్లేదు .... ??

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>