PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/itela-harish-rewanths-new-telangana-party6f9da86e-0d75-4e78-83be-4630b9bffb42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/itela-harish-rewanths-new-telangana-party6f9da86e-0d75-4e78-83be-4630b9bffb42-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌ల‌నం తెర‌మీదికి రానుందా? తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా? దీనికి ప్ర‌స్తుతం అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ఉన్న మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, హ‌రీష్‌రావు, కాంగ్రెస్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి సార‌థ్యం వ‌హించ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు.. సోష‌ల్ మీడియా జ‌నాలు. ఈ విష‌యం అత్యంత సంచ‌ల‌నంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇక్క‌డ‌.. కొత్త పార్టీ ఏర్పాటు కొత్త‌కాదు.. వ్య‌క్తులే ముఖ్యం. కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు క‌దుపుతున్నారంటrevanth etela harish rao;kcr;revanth;telangana;revanth reddy;congress;mp;media;minister;letter;reddy;party;mantraఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?revanth etela harish rao;kcr;revanth;telangana;revanth reddy;congress;mp;media;minister;letter;reddy;party;mantraFri, 30 Apr 2021 20:20:00 GMTతెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌ల‌నం తెర‌మీదికి రానుందా? తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా? దీనికి ప్ర‌స్తుతం అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ఉన్న మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, హ‌రీష్‌రావు, కాంగ్రెస్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి సార‌థ్యం వ‌హించ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు.. సోష‌ల్ మీడియా జ‌నాలు. ఈ విష‌యం అత్యంత సంచ‌ల‌నంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇక్క‌డ‌.. కొత్త పార్టీ ఏర్పాటు కొత్త‌కాదు.. వ్య‌క్తులే ముఖ్యం. కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు క‌దుపుతున్నారంటున్న ఆ ముగ్గురు నేత‌లే అంత్యంత కీల‌కం.

తెలంగాణ వాదులుగా ఫుల్లు ఫాలోయింగ్‌!
తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ ముగ్గ‌రు నేత‌ల‌కు అత్యంత ప్రాధాన్యం, ప్ర‌జాద‌ర‌ణ‌.. మెండుగా ఉన్నాయి. పార్టీలు ఏవైనా.. వీరికి ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో హ‌రీష్‌రావు, ఈట‌ల స్వ‌యంగా పాల్గొని అనేక ఎద‌రు దెబ్బ‌లు తిని.. రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఇక‌, రేవంత్ రెడ్డికూడా అప్ప‌ట్లో టీడీపీలోనే ఉన్నా.. తెలంగాణ ఉద్య‌మానికి అంతో ఇంతో స‌హ‌క‌రించారు. తెలంగాణ వ్య‌క్తిగా, నాయ‌కుడిగా ఆయ‌న ఈ వాదాన్న బ‌లంగానే తీసుకువెళ్లారు. ముఖ్యంగా రాజ‌కీయ ఫైర్ బ్రాండ్‌గా ఆయ‌న మంచి గుర్తింపు సంపాయించుకున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు వీరికి కొత్త పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

కొన్నాళ్లుగా అవ‌మానాలు!
అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, ఏకంగా సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీష్‌రావుకు రెండో ద‌శ‌లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌రైన గుర్తింపు లేకుండా పోయింద‌నేది నిర్వివాదాంశం. ముఖ్యంగా ఇద్ద‌రికీ మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంలో కేసీఆర్ తాత్సారం చేశారు. అదేస‌మ‌యంలో మ‌ధ్య‌లోనే అంటే ఏడాది గ‌డిచేలోపే ఈట‌ల‌ను తొల‌గిస్తా రంటూ.. అధికార పార్టీ అనుకూల మీడియాలో వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చాయి. దీనికితోడు తాజాగా ఆయ‌న‌ను మ‌ళ్లీ మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గిస్తార‌ని.. ప్ర‌ధాన మీడియాలో నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్థాపంతోఉన్నారు.

ఈ మంత్రిది మ‌రో ఆవేద‌న‌
ఇక‌, మంత్రి హ‌రీష్‌రావును చూస్తే.. ఈయ‌న‌కు మ‌రో ఆవేద‌న ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం కేసీఆర్‌కు సొంత మేన‌ల్లుడు కావ‌డం ఈయ‌న‌కు శాపంగా మారింద‌ని చెబుతున్నారు. పార్టీలో ఎక్క‌డ ఎదిగిపోతారో.. త‌న కుమారుడు కేటీఆర్‌కు ఎక్క‌డ ఎస‌రు పెడ‌తారో.. అనే భ‌యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. హ‌రీష్‌ను ఇటీవ‌ల కాలంలో ప్రాధాన్యం త‌గ్గిస్తూ.. వ‌స్తున్నార‌నే వాద‌న ఉంది. దీనికితోడు.. దుబ్బాక ఉప‌ పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నప్ప‌టికీ.. కొంద‌రు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డంతో హ‌రీష్ మంత్రాంగం విఫ‌ల‌మైంది. దీంతో కేసీఆర్ అప్ప‌టి నుంచి హ‌రీష్‌ను మ‌రింత ఎడం పెడుతున్నార‌నే వాద‌న ఉంది. దీంతో ఈయ‌న‌కూడా అన్య‌మ‌న‌స్కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రేవంత్‌ను స‌రిగా ట్రీట్ చేయ‌డం లేదా?
ఇక‌, కొత్త పార్టీ పెడుతున్న ముగ్గురు నాయ‌కుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ రేవంత్ కూడా ఉండ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రేవంత్‌కు తెలంగాణ‌లో యూత్ ఫాలోయింగ్ ఉంది. దీంతోతాను పీసీసీ అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్టాల‌ని కొన్నాళ్లుగా భావిస్తున్నారు. అయితే.. సీనియ‌ర్లు మాత్రం దీనిని వ్య‌తిరేకిస్తున్నారు. సంస్థాగ‌తంగా పార్టీలో ఉన్న‌వారికే ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. ప్ర‌జ‌ల్లో ఇమేజ్ లేనివారు.. ఓడిపోయిన వారు త‌న‌పై పెత్త‌నం చేయ‌డాన్ని రేవంత్‌స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఈ ఇద్ద‌రు మంత్రుల‌తో జ‌త క‌డ‌తార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కొత్త‌పార్టీ ఏర్పాటు ఖాయ‌మ‌ని.. ఈ ముగ్గ‌రు కూడా తెలంగాణ న‌లుచెర‌గులా.. మంచి ఫాలోయింగ్ ఉన్న‌వారే క‌నుక‌.. ఇబ్బంది లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో.. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో.. చూడాలి.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??

పాటల ఫిలాసఫీ: కరోనా గాయానికి ఈ పాట ఒక మందులాంటిది ?

తెలంగాణా మంత్రి భూ కబ్జాలు, మీడియాలో సంచలన కథనం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>